News January 17, 2026
ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ బదిలీ

ఉట్నూర్ అదనపు ఏఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కాజల్ సింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఐపీఎస్‌ల బదిలీలు చేపడుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏఎస్పీ కాజల్ సింగ్‌ను హైదరాబాద్ ట్రాఫిక్ 2 డీసీపీగా బదిలీ చేశారు. కొంత కాలంగా ఉట్నూర్ ఏఎస్పీగా ఉన్న ఆమె పలు కేసుల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించారు.
Similar News
News February 13, 2026
ఉట్నూర్: 4KGల గంజాయి స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్

నమ్మదగిన సమాచారంతో ఇంద్రవెల్లి పోలీసులు శ్మశానవాటిక వద్ద నిఘా ఉంచి గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు కొడప రమేష్, కుంర గంగారం, కుముర కృష్ణల వద్ద నుంచి 4కిలోల గంజాయి, మోటార్ సైకిల్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను ఉట్నూర్ కోర్టులో రిమాండ్ చేసినట్లు ఎస్ఐ సాయన్న వెల్లడించారు.
News February 13, 2026
సిబ్బందికి శుభాకాంక్షలు: ఆదిలాబాద్ కలెక్టర్

జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బంది క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసి మొత్తం ప్రక్రియను సాఫీగా పూర్తి చేశారని ఆయన అభినందించారు. మద్దతు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కౌంటింగ్‌లో పాల్గొన్న సిబ్బంది, భద్రతా సిబ్బంది, సంబంధిత అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
News February 13, 2026
విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవు: ADB DSP

ఆదిలాబాద్ మున్సిపల్ ఫలితాల వేళ డీఎస్పీ జీవన్ రెడ్డి ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, టపాకాయలు పేల్చడం నిషేధమని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రం, ప్రధాన చౌరస్తాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. ప్రజలు గుమిగూడరాదని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని, పోలీసులకు సహకరించాలని కోరారు.


