News December 23, 2024

ఉట్నూర్: కేటీఆర్‌పై కక్షపూరితంగానే కేసులు

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వం కక్షపూరితంగానే కేసులు నమోదు చేస్తుందని బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ అన్నారు. ఆదివారం అయన ఉట్నూర్‌లో మాట్లాడుతూ.. గురుకుల పాఠశాల విద్యార్థుల ఫుడ్ పాయిజన్ పై నిలదీయడం, హైడ్రా బాధితులకు అండగా నిలబడడంతోనే కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. కేటీఆర్‌ను టచ్ చేస్తే ఆందోళన తప్పదన్నారు.

Similar News

News December 9, 2025

గర్భిణులకు ఎంసీపీ కార్డులేవు.. తాత్కాలికంగా జిరాక్స్ కార్డులు అందజేత

image

మాతా శిశు మరణాలను సున్న శాతానికి చేర్చడమే లక్ష్యమని వైద్య శాఖ ఉన్నతాధికారులు సమీక్షలు చేస్తున్నారు కానీ కనీసం గర్భిణులకు వివరాలను నమోదు చేసే కార్డులను సమకూర్చలేని దుస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. గర్భిణులు సొంత ఖర్చుతోనే పాత వాటిని జిరాక్స్ తీస్తున్నారు. నార్నూర్, గాదిగూడ పీహెచ్‌సీలో ఈ పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి గర్భిణులకు ఎంసీపీ కార్డులు అందజేయాలని కోరుతున్నారు.

News December 9, 2025

ఆదిలాబాద్: ‘అన్నా నమస్తే.. ఊరికొస్తున్నావా’

image

ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడతలో 166 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఎన్నికలకు మరో ఒక్క రోజే గడువు ఉండడంతో అందుబాటులో లేని స్థానిక ఓటర్లకు అభ్యర్థులు పదేపదే కాల్స్ చేస్తున్నారు. చాలా మంది రాజధాని పరిధిలోని HYD,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లారు. వారికి కాల్ చేసి ‘అన్నా నమస్తే.. ఊరికొస్తున్నావ్ కదా.. నాకే ఓటేయాలి’ అంటూ ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తున్నారని సమాచారం.

News December 9, 2025

ఆదిలాబాద్: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

image

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, సిరికొండ, గాదిగూడ, ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూరు మండలాల్లోని 166 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.