News December 23, 2024
ఉట్నూర్: కేటీఆర్‌పై కక్షపూరితంగానే కేసులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వం కక్షపూరితంగానే కేసులు నమోదు చేస్తుందని బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ అన్నారు. ఆదివారం అయన ఉట్నూర్‌లో మాట్లాడుతూ.. గురుకుల పాఠశాల విద్యార్థుల ఫుడ్ పాయిజన్ పై నిలదీయడం, హైడ్రా బాధితులకు అండగా నిలబడడంతోనే కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. కేటీఆర్‌ను టచ్ చేస్తే ఆందోళన తప్పదన్నారు.
Similar News
News January 20, 2025
ఆదిలాబాద్: యువకుడిపై పోక్సో కేసు నమోదు
ఓ యువకుడిపై ADB 1 టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. DSP జీవన్ రెడ్డి వివరాలు.. ఓ కళాశాలలో చదువుతున్న బాలిక (17)తో సుందరయ్యనగర్‌కు చెందిన చౌహాన్ అంకుష్ (23) పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఈనెల 10న ఆమెను HYD తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన పోలీసులు బాలిక ఆచూకీ తెలుసుకున్నారు. అనంతరం అతడిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు.
News January 20, 2025
నార్నూర్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
నార్నూర్ మండలంలోని మాలేపూర్ ఘాట్ వద్ద జరిగిన ప్రమాదంలో కుమ్రం మల్కు మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. గుడిహత్నూర్ సూర్యపేట గ్రామంలో నుంచి జంగుబాయి దైవదర్శనానికి వెళ్తున్న గ్రామస్థుల ఐచర్ వ్యాన్ ప్రమాదం జరిగిన విషయం తెలిసింది. క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా మల్కు మృతిచెందగా.. పలువురు చికిత్స పొందుతున్నారు.
News January 20, 2025
నార్నూర్ ఘాట్ రోడ్డు భద్రతపై ముందే హెచ్చరించిన Way2news
నార్నూర్ నుంచి మలంగి గ్రామానికి వెళ్లే దారిలో వచ్చే ఘాట్ రోడ్డు భద్రతపై Way2news ముందే హెచ్చరించింది. ఇటీవల రోడ్డు ప్రమాదకర స్థితిలో ఉందని పలు కథనాలు ప్రచురించింది. అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. ఆదివారం ఘాట్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరగడంతో ప్రజలు Way2news కథనాలపై చర్చించుకున్నారు. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదని పేర్కొంటున్నారు.