News March 5, 2025
ఉట్నూర్: చెట్టు లాలించింది.. అమ్మ పరీక్ష రాసొచ్చింది

చీరతో చెట్టుకు ఊయలకు కట్టి అందులో పాపను ఉంచి తల్లి ఇంటర్ పరీక్ష రాసిన ఆసక్తికర ఘటన ఉట్నూర్ మండలం లాల్‌టెక్డిలో చోటుచేసుకుంది. స్థానిక గురుకుల కళాశాలలోని పరీక్షకేంద్రానికి బుధవారం ఓ తల్లి బిడ్డతో వచ్చింది. చదువుకోవాలనే తపన తల్లిది.. కానీ బిడ్డను ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో పాలు తాగే వయసున్న బిడ్డను చెట్టుకు చీరతో ఊయల కట్టి అందులో ఉంచింది. తోడుగా తన తల్లిని ఉంచి పరీక్ష రాసొచ్చింది.
Similar News
News March 20, 2025
ఆదిలాబాద్: 22న యువజన ఉత్సవ పోటీలు

ADB ప్రభుత్వ డిగ్రీ కళాశాల (సైన్స్)లో మార్చ్ 22న జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జే.సంగీత, నెహ్రూ యువజన కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ సుశీల్ బడ్ ప్రకటనలో పేర్కొన్నారు. పోటీల్లో 15-29 వయసున్న డిగ్రీ చదివినా లేదా చదువుతున్న యువతీ యువకులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. పెయింటింగ్, మొబైల్ ఫొటోగ్రఫీ, కవితా రచన, ఉపన్యాసం, సాంస్కృతిక నృత్య విభాగంలో పోటీలు ఉంటాయన్నారు.
News March 20, 2025
ADB: రిమ్స్‌లో అన్ని డెలివరీలు చేయాలి: కలెక్టర్

రిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు వైద్య సిబ్బంది ముందుండాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. రిమ్స్ వైద్య కళాశాలలో బుధవారం అన్ని శాఖల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో సమీక్ష నిర్వహించారు. రిమ్స్ ఆస్పత్రికి వచ్చే వారందరూ పేద ప్రజలేనని.. వారిని దృష్టిలో ఉంచుకొని వైద్య సేవలు అందించాలన్ నారు. ముఖ్యంగా గైనకాలజీ డిపార్ట్మెంట్లో అన్ని రకాల డెలివరీస్ చేయాలని పేర్కొన్నారు.
News March 20, 2025
ADB: ఇంటర్ పేపర్ కరెక్షన్‌కు వేళాయె..!

తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, పౌరశాస్త్రం సబ్జెక్టుల ఇంటర్మీడియట్ మొదటి విడత మూల్యాంకనం ఈనెల 21 నుంచి ప్రారంభిస్తామని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ రెసిడెన్షియల్, కేజీబీవీ, ఆదర్శ, ప్రైవేట్ కళాశాల్లో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు ADBలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో రిపోర్ట్ చేయాలని సూచించారు. అధ్యాపకులు ఉదయం 10:00 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు.