News November 9, 2024

ఉట్నూర్: నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాల కళాశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ లెక్చరర్ పోస్టుల దరఖాస్తు గడువు శనివారంతో ముగియనుంది. కాగా జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు పోస్టులకు ఉట్నూర్‌లోని ఆర్సీఓ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5గంటల వరకు అప్లై చేసుకోవచ్చని ఐటీడీవో పీవో ఖుష్బు గుప్తా వెల్లడించారు.

Similar News

News November 29, 2025

నేడు ముగియనున్న నామినేషన్ గడువు: కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి దశ నామినేషన్‌ దాఖల గడువు ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులు తక్షణమే నామినేషన్‌లు వేయాలని కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. నామినేషన్‌ల స్వీకరణకు ఇవాళే చివరి రోజు కావడంతో ప్రతి గ్రామంలో మైక్ అనౌన్స్‌మెంట్లు నిర్వహించి ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు. సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌ డెస్కులను సిద్ధంగా ఉంచాలని తెలిపారు.

News November 29, 2025

డిసెంబర్ 4న ADB జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

image

ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి త్వరలో పర్యటించనున్నారు. డిసెంబర్ 4వ తేదీన జిల్లాకు రాయనున్నట్టు అధికార వర్గాలు శుక్రవారం తెలిపారు. జిల్లాలో పలు ప్రారంభోత్సవాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. సీఎం పర్యటన నేపథ్యంలో విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టారు.

News November 28, 2025

ఆదిలాబాద్: ఉద్యోగం పేరుతో మోసం

image

సింగరేణి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని బాలేరావ్ గౌతం అనే వ్యక్తి వద్ద నుంచి రెండు లక్షలు వసూలు చేసిన మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ జవాడే అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. నిరుద్యోగులు మధ్యవర్తుల మాటలు విశ్వసించవద్దని సూచించారు. మోసపోయినట్లయితే జిల్లా పోలీసులను సంప్రదించాలని సీఐ కోరారు.