News February 8, 2025
ఉట్నూర్: సీఎంను కలిసిన కొమరం భీమ్ మనవడు
ఉట్నూర్: రాష్ట్ర పండుగగా కొమరం భీమ్ వర్ధంతిని జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని హర్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డిని కొమరం భీమ్ మనవడు సోనేరావు శుక్రవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలసి సన్మానించారు. రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జోడేఘాట్ ప్రాంతంలోని 12 గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.
Similar News
News February 8, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శనివారం క్వింటా సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,910గా నిర్ణయించారు. శుక్రవారం ధరతో పోలిస్తే శనివారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధరలో సైతం ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
News February 8, 2025
ఇచ్చోడ: రాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఇచ్చోడలో చోటుచేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. MH చంద్రపూర్‌కు చెందిన గాయక్వాడ్ అంకుస్, భార్య జ్యోతితో జున్ని గ్రామంలోని వారి బంధువుల ఇంటికి వస్తున్నారు. ఈక్రమంలో NH-44 క్రాస్ రోడ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని జ్యోతి స్పాట్‌లోనే మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలు కాగా రిమ్స్ తరలించారు.
News February 8, 2025
ఉట్నూర్: ప్రజలు ఆందోళన చెందవద్దు: ఎమ్మెల్యే
కవ్వాల టైగర్ జోన్ పరిధిలోని అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాహనాల రాకపోకలను నిషేధిస్తూ విధించిన ఆంక్షలను శుక్రవారం ఎత్తి వేశారు. ఇకపై చెక్ పోస్టుల వద్ద అటవీ శాఖ వేధింపులు ఉండవని ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కంజర్వెటర్ రాకేశ్‌ను ఎమ్మెల్యే కలిసి అటవీ శాఖ అధికారులను తీరును ఆయన వివరించారు.