News March 25, 2024

ఉత్కంఠ రేపుతున్న మహిధర్ రెడ్డి మౌనం

image

YCP టిక్కెట్ చేజారిన నేపథ్యంలో కందుకూరు MLA మానుగుంట మహిధర్ రెడ్డి వ్యూహం ఏమిటన్నది ఉత్కంఠ రేపుతోంది. BJP.. లేదా TDP అభ్యర్ధిగా పోటీ చేసి YCPకి ఝలక్ ఇస్తారని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. ఇటు YCPకి మద్దతూ తెలపలేదు. MP అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ మహీధర్ రెడ్డిని కలిసి మద్దతు కోరినప్పటికీ నిర్ణయం మాత్రం సస్పెన్స్‌గానే ఉంది.

Similar News

News December 4, 2025

పోక్సో కేసులను త్వరితగతిన విచారించండి: SP

image

పోక్సో కేసులను త్వరితగతిన విచారించి పూర్తి చేయాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం నుంచి ఆయన గురువారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి లోపం కనిపించకూడదన్నారు. గంజాయి వంటి మత్తుపదార్థాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

News December 4, 2025

ప్రకాశంలో జోరు తగ్గిన మద్యం.. లెక్కలివే!

image

ప్రకాశంలో నవంబర్‌కు సంబంధించి మద్యం కొనుగోళ్ల జోరు తగ్గింది. అధికారుల వద్ద ఉన్న లెక్కల మేరకు (కోట్లల్లో).. ఈ ఏడాది జనవరిలో రూ. 105.69, ఫిబ్రవరి రూ. 106.28, మార్చి రూ. 117.41, ఏప్రిల్ రూ.66.5, మే రూ.117.41, జూన్ రూ.110.26, జులై రూ.105.37, ఆగస్ట్ రూ.118.62, సెప్టెంబర్ రూ.111.52, అక్టోబర్ రూ.95.38, నవంబర్ రూ. 86.75 కోట్లల్లో ఆదాయం దక్కింది. డిసెంబర్‌లో ఆదాయం అధికంగా రావచ్చని అధికారుల అంచనా.

News December 3, 2025

మద్దిపాడులో వసతి గృహాలను తనిఖీ చేసిన ప్రకాశం కలెక్టర్

image

మద్దిపాడులోని SC, ST, BC సంక్షేమ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ వద్ద విద్యార్థులకు కల్పించిన సౌకర్యాల గురించి కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థుల హాజరు శాతం, పలు రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంలో అశ్రద్ధవహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.