News January 31, 2025
ఉత్తమ ఆర్టీసీ డ్రైవర్లను సన్మానించిన వరంగల్ సీపీ

ప్రమాద రహిత డ్రైవింగ్ చేసిన ఆర్టీసీ డ్రైవర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందించి సన్మానం చేశారు. హనుమకొండ ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయ భాను అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ ప్రమాద రహిత డ్రైవింగ్ చేయాలని వారు పిలుపునిచ్చారు. రీజియన్లోని డీఎంలు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 27, 2025
తుఫాన్.. ఈ జిల్లాల్లో సెలవులు పొడిగింపు

AP: ‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరులో అధికారులు రేపు కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడలో ఈ నెల 31 వరకు సెలవులు కొనసాగనున్నాయి. విశాఖ, కడప, ఏలూరు, ఉమ్మడి గోదావరిలో రేపు, కోనసీమ, కృష్ణా, NTR, గుంటూరు, అనకాపల్లి, విజయనగరం, మన్యం, అనకాపల్లి, బాపట్ల, అల్లూరిలో ఎల్లుండి వరకు హాలిడేస్ ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురంలో ఎలాంటి సెలవులు ఇవ్వలేదు.
News October 27, 2025
ASF: ‘పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి’

తుపాను వలన అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ASF జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
News October 27, 2025
‘మనీవ్యూ’కు సైబర్ షాక్.. 3 గంటల్లో ₹49 కోట్లు కొల్లగొట్టారు

రుణాలిచ్చే మనీవ్యూ యాప్కు సైబర్ నేరగాళ్లు షాకిచ్చారు. యాప్ సిస్టమ్లోకి చొరబడి 3గంటల్లో ₹49 కోట్లు కొల్లగొట్టారు. 653 ఫేక్ అకౌంట్లకు డబ్బును బదిలీ చేసుకున్నారు. దుబాయ్, చైనా, హాంగ్కాంగ్, ఫిలిప్పీన్స్ నుంచి అంతర్జాతీయ ముఠా ఈ దాడి చేసిందని బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. దుబాయ్లోని భారత సంతతి వ్యక్తి సూత్రధారి అని చెప్పింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి, ₹10 కోట్లు ఫ్రీజ్ చేశారు.


