News August 16, 2024

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సోమశేఖరశర్మ తెలిపారు. దరఖాస్తులను ఈనెల 20లోగా ఖమ్మం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందించాలని తెలిపారు. 2022-23,2023-24లో వివిధ అంశాలతో నిర్ణీత నమూనాలు నేరుగా డీఈవో కార్యాలయానికి అందించాలని, దరఖాస్తుదారులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు పెండింగ్ లో లేవని, కోర్టు కేసులు పెండింగ్లో లేవని ధ్రువీకరణ పత్రాలు అందించాలని తెలిపారు.

Similar News

News January 15, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ∆} జూలూరుపాడులో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యాటన ∆} అమ్మపేటలో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన

News January 15, 2025

ఖమ్మం ఖిల్లాపై రోప్ వే.. హిస్టరీ ఇదే

image

ఖమ్మం ఖిల్లాపై రూ.30కోట్లతో ప్రభుత్వం రోప్ వే నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఖిల్లాలో ఉన్న జాఫర్ బావికి సైతం పునరుద్ధరణ పనులు చేస్తోంది. అయితే ఈ ఖిల్లాకు చారిత్రక నేపథ్యం ఉంది. మొదట దీని పేరు ఖమ్మంమెట్టు కాగా క్రీ.శ 950లో నిర్మాణానికి పునాదులు పడ్డాయి. 400 ఏళ్లపాటు కాకతీయులు, 300 ఏళ్లపాటు రెడ్డి రాజుల అధీనంలో ఉండగా అనంతరం కుతుబ్ షాహీ వంశస్థులు కోటను మెరుగుపరిచి ఖమ్మం ఖిల్లాగా పేరు మార్చారు.

News January 15, 2025

KMM: పండుగపూట.. యువకుడి కిడ్నాప్ కలకలం!

image

పండగపూట యువకుడు కిడ్నాప్‌నకు గురైన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. వారి వివరాలిలా.. పోలెపల్లి రాజీవ్ గృహ కాలనీకి చెందిన సంజయ్ కుమార్ సోమవారం రాత్రి తన అన్నను తీసుకురావడానికి బస్టాండ్‌కు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని అన్న సాయికి సంజయ్ కుమార్‌ ఫోన్ చేశాడు. కొద్ది సేపటికే సంజయ్ ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.