News July 5, 2024

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2024-25 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నుంచి జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్.చంద్రకళ తెలిపారు. ఆన్లైన్లో అర్హతలు, వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. జులై 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News December 5, 2025

ఆయుష్మాన్ భారత్ పథకంలో మధుమేహ రోగులను చేర్చాలి: ఎంపీ

image

ఆయుష్మాన్ భారత్ పథకంలో టైప్-1 మధుమేహం రోగులను, అవుట్ పేషెంట్ సేవలు కూడా చేర్చాలని ఎంపీ శ్రీ భరత్ పార్లమెంట్‌ సమావేశాల్లో కోరారు. ఇన్సులిన్, గ్లూకోజ్ లాంటి ముఖ్య ఔషధాలు ప్రజారోగ్య సంస్థల్లో నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్సులిన్ ఒక మందు మాత్రమే కాదని, జీవనాధారమన్నారు. వీటి లభ్యత, ధరల సమస్య కారణంగా ఎవరూ ప్రాణం కోల్పోకూడదని, ఈ విషయంలో కేంద్రం తక్షణమే స్పందించాలన్నారు.

News December 5, 2025

విశాఖలో జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీలు

image

ప్రతిష్టాత్మకమైన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీలు విశాఖ వేదికగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఈ పోటీలకు విశాఖ నగరం ఆతిధ్యం ఇస్తున్నట్లు ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అద్యక్షుడు సుధాకర రెడ్డి తెలిపారు. శుక్రవారం బీచ్ రోడ్డులోని VMRDA పార్క్ స్కేటింగ్ రింక్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 11 విభాగాలలో జరిగే పోటీలకు 4000 మంది హాజరవుతారన్నారు

News December 5, 2025

విశాఖ: ‘డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేశారు’

image

డీఎస్పీగా చెప్పుకొని యువకుడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో నలుగురు నిందితులను విజయనగరం రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 3 కార్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 23న డెంకాడ వద్ద విశాఖకు చెందిన మహేష్ కుమార్ యాదవ్‌ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసులో మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతోందని రూరల్ CI లక్ష్మణ రావు తెలిపారు.