News December 19, 2024
ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్న కర్నూలు ఎస్పీ

కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్‌కు ఉత్తమ ప్రశంసా పత్రం లభించింది. డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు చేతుల మీదుగా ఆయన ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. లోక్ అదాలత్‌లో 7,913 కేసులను పరిష్కరించి రాష్ట్రంలోనే కర్నూలు పోలీస్ శాఖను మొదటి స్థానంలో నిలపడంతో ఎస్పీని డీజీపీ తిరుమల రావు ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News April 18, 2026
భూగర్భ జలాల పెంచడమే లక్ష్యం: కలెక్టర్

భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యమని కలెక్టర్ సిరి పేర్కొన్నారు. శనివారం కోడుమూరు మండలం ఆమడగుంట్లలో నీటి భద్రత, జల ధార జల హారతి కార్యక్రమం నిర్వహించారు. వంకలను, వాగులను, చెరువులను గుర్తించి వాటికి మరమ్మత్ పనులు చేపట్టి నీరు నింపుతామన్నారు. తద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. నీటిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.
News April 18, 2026
జలధార పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు కోసం చేపట్టిన జలధార–జలహారతి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 479 గ్రామాల్లో 3,435 పనులను గుర్తించినట్లు ఆమె తెలిపారు. చెరువులు, కుంటల పూడికతీత ద్వారా నీటి నిల్వలు పెంచడమే లక్ష్యమన్నారు. వర్షాకాలం ప్రారంభం కావడానికి ముందే ఈ పనులన్నీ పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.