News February 5, 2025

ఉత్తమ ఫలితాలు సాధించాలి: ASF అదనపు కలెక్టర్

image

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మంగళవారం వాంకిడి మండలం ఇందాని ZPHSను ఆయన సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మెనూతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని చెప్పారు.

Similar News

News February 23, 2026

₹130 కోట్ల భారీ రివార్డు ఉన్న క్రిమినల్ హతం!

image

ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడు, మెక్సికోలోని అత్యంత శక్తిమంతమైన ‘జాలిస్కో న్యూ జనరేషన్’ (CJNG) డ్రగ్ కార్టెల్ బాస్ ‘ఎల్ మెంచో’ ఆర్మీ ఆపరేషన్‌లో హతమయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున జాలిస్కో రాష్ట్రంలోని తపాల్పాలో జరిగిన మెరుపు దాడిలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. మెక్సికో సిటీకి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. అతనిపై US ప్రభుత్వం గతంలో సుమారు ₹130 కోట్ల రివార్డును ప్రకటించింది.

News February 23, 2026

నిర్మల్ జిల్లాకు పతకాల పంట

image

రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలలో నిర్మల్ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఆదివారం జరిగిన పోటీల్లో జిల్లాకు మరిన్ని పతకాలు దక్కాయి. రిథమిక్ యోగా అండర్-14 సబ్ జూనియర్ బాలుర విభాగంలో మాగం చరణ్ ప్రతిభ కనబరిచి వెండి పతకం సాధించాడు. అలాగే, అండర్-25 విభాగంలో దిలీప్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. విజేతలను అధికారులు, క్రీడాభిమానులు అభినందించారు.

News February 23, 2026

KNR: ‘’డిప్యూటీ’ మేయర్‌కి ఛాంబర్ ఉన్నట్టా.. లేనట్టా..?

image

కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆశలకు గండి పడినట్లు తెలుస్తోంది. ఆదివారం మేయర్ శ్రీనివాస్ తన ఛాంబర్‌లోకి అడుగుపెట్టగా, అదే సమయంలో డిప్యూటీ మేయర్‌కు కూడా ఛాంబర్ కేటాయిస్తారని భావించినా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికారులు నిర్ణయం తీసుకోలేదు. బీజేపీయేతర పార్టీల నాయకుల ఫిర్యాదు మేరకు ఛాంబర్ అలాట్ నిలిచిపోయింది. ఆయా పార్టీల నాయకులు ఫిర్యాదుతో అధికారులు కూడా వెనుకంజ వేసినట్లు సమాచారం.