News February 5, 2025

ఉత్తమ ఫలితాలు సాధించాలి: ASF అదనపు కలెక్టర్

image

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మంగళవారం వాంకిడి మండలం ఇందాని ZPHSను ఆయన సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మెనూతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని చెప్పారు.

Similar News

News February 5, 2025

వనపర్తి: ఏఆర్ కానిస్టేబుల్ సస్పెండ్.!

image

వనపర్తి జిల్లా సాయుధ దళ కార్యాలయం (ఆర్మ్డ్ రిజర్వ్) విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ డి.రవి కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కానిస్టేబుల్ రవికుమార్‌పై పెబ్బేరు పోలీస్ స్టేషన్‌లో ఒకే రోజు 3 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. నిర్లక్ష్యంగా, దుష్ప్రవర్తనతో వ్యవహరించిన కారణంగా కానిస్టేబుల్ రవికుమార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ రావుల గిరిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.

News February 5, 2025

MHBD: వైద్యం వికటించి యువకుడు మృతి

image

తొర్రూరు మండలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బాధితులు, స్థానికుల వివరాలు.. వైద్యం వికటించి సిద్ధూ(16) మృతి చెందాడు. జలుబు వస్తుందని ఆసుపత్రికి వెళ్తే ఇంజెక్షన్ వేశారని, ఆ వెంటనే సిద్దు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. దీంతో కుటుంబ సభ్యులు డెడ్ బాడీతో ఆస్పత్రిలోనే ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 5, 2025

కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 1109 మంది అరెస్టు

image

కామారెడ్డి జిల్లాలో మద్యం సేవించి జనవరి నెలలో 1109 మంది వాహనదారులు పట్టుబడినట్లు ఎస్పీ సింధుశర్మ తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన  జరిమానాలు విధిస్తామన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూదని తల్లిదండ్రులకు ఎస్పీ సింధుశర్మ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

error: Content is protected !!