News February 5, 2025
ఉత్తమ ఫలితాలు సాధించాలి: ASF అదనపు కలెక్టర్

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. మంగళవారం వాంకిడి మండలం ఇందాని ZPHSను ఆయన సందర్శించారు. పాఠశాలలో కొనసాగుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మెనూతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని చెప్పారు.
Similar News
News January 16, 2026
గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు: రేవంత్

TG: గత ప్రభుత్వం సొంత లాభం మాత్రమే చూసుకుందని సీఎం రేవంత్ విమర్శించారు. ‘కుటుంబం, పార్టీ, రాజకీయ అవసరాలే ప్రాధాన్యంగా గత ప్రభుత్వం పని చేసింది. ప్రాణాలకు తెగించి మరీ యువకులు రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఉద్యోగాలు వస్తాయని ఆశించినా నిరాశే ఎదురైంది. కానీ 2014 నుంచి ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము TGPSCని ప్రక్షాళించి పరీక్షలు నిర్వహిస్తున్నాం’ అని గ్రూప్-3 నియామకపత్రాల పంపిణీలో తెలిపారు.
News January 16, 2026
విశాఖ మీదగా అమృత్ భారత్ స్లీపర్ సర్వీస్.. రేపట్నుంచే

విశాఖలో రైల్వే ప్రయాణికులకు రైల్వే బోర్డు తీపి కబురు అందించింది. న్యూజల్ పాయ్ గురి నుంచి విశాఖ మీదుగా తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు వెళ్లే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు
రైల్వే బోర్డు శుక్రవారం తెలిపింది. జనవరి 17న మధ్యాహ్నం న్యూజల్‌పాయ్‌గురి నుంచి మరుసటి రోజు 1:45కు విశాఖ చేరుతుంది. దువ్వాడకు మధ్యాహ్నం 3.35కు చేరుతుంది.
News January 16, 2026
కర్నూలు: ‘యువకుడి మృతి.. గుర్తిస్తే చెప్పండి’

కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్ గేట్ సమీపంలో ఇవాళ సాయంత్రం బైక్ ఢీకొనడంతో గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 25-30 ఏళ్లు ఉంటాయి. ఎడమ చేతి మణికట్టుపై ॐ, GP పచ్చబొట్లు ఉన్నాయి. వివరాలు తెలిసిన వారు కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ 9121101063 నంబర్‌కు సంప్రదించాలని పోలీసులు కోరారు.


