News February 6, 2025
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మరో నామినేషన్

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి గురువారం ఒక నామినేషన్ దాఖలు అయ్యింది. పీడీఎఫ్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి కోరెడ్ల విజయకుమారి తన మద్దతుదారులతో కలిసి విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు సంబంధిత పత్రాలు అందజేసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కలెక్టర్ ఆమె చేత ప్రమాణం చేయించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి.
Similar News
News October 17, 2025
బాపట్ల: జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు అందించాలి

జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ డా.వి.వినోద్‌కుమార్. బాపట్లలో జరిగిన గ్రామీణ నీటి సరఫరా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం 1.48 లక్షల గృహాలకు మాత్రమే కొళాయి కనెక్షన్లు ఉన్నాయని, మిగిలిన 2.15 లక్షల గృహాలకు డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రూ.167.48 కోట్లతో 403 పనులు జరుగుతుండగా, ఆలస్యం చేసిన ఏజెన్సీలకు నోటీసులు ఇవ్వాలని హెచ్చరించారు.
News October 17, 2025
HYD: రేపు బంద్.. మరి వైన్స్ టెండర్లు..?

రేపు బీసీ సంఘాలు తెలంగాణ బంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వైన్స్ టెండర్లకు ఎటువంటి అడ్డంకి ఉండదని, సెంటర్లు యథావిధిగా కొనసాగుతాయని DPEO ఉజ్వల రెడ్డి ఈరోజు HYDలో తెలిపారు. రేపటితో వైన్స్ టెండర్ల ప్రక్రియ ముగియనున్నట్లు చెప్పారు. రేపు సా.5 గంటల్లోపు సెంటర్లో ఉన్న వారి అప్లికేషన్లు మాత్రమే స్వీకరిస్తామని తెలిపారు. రేపు చివరి రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.