News December 31, 2024
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా విడుదల

ఉమ్మడి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదాను ఎన్నికల అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సోమవారం విడుదల చేశారు. శ్రీకాకుళం విజయనగరం, మన్యం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాలో 21,555 ఓటర్లులో ఉన్నట్టు ముసాయిదాలో ప్రకటించారు. ఈ ముసాయిదాను వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. ఈ జాబితాను వివిధ రాజకీయ పార్టీలకు అందజేయనున్నారు.
Similar News
News October 13, 2025
ఆక్రమణకు గురౌతున్న ఏయూ భూములు..!

నగరంపాలెంలోని ఏయూ 137 ఎకరాల భూమిని ఏయూ వీసీ జి.పి రాజశేఖర్, రిజిస్ట్రార్ రాంబాబు సోమవారం పరిశీలించారు. కొంత భూమి ఆక్రమణలకు గురిఅవుతోందని, మరికొంత స్థలంలో అనధికార రహదారి నిర్మాణం జరుగుతుండటాన్ని గుర్తించారు. ఏయూ భూముల సరిహద్దులను త్వరగా నిర్ధారించాలన్నారు. భూమిని పరిరక్షించే విధంగా అవసరమైన చర్యలను సత్వరం చేపట్టాలని వీసీ అధికారులకు ఆదేశించారు.
News October 13, 2025
ఏయూలో ఆకస్మిక తనిఖీ చేసీన వీసీ

ఏయూలో పలు విభాగాలను వైస్ ఛాన్సెలర్ రాజశేఖర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ పనివేళల్లో సిబ్బంది తప్పనిసరిగా విధుల్లో ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.అనంతరం ఏయూ డిస్పెన్సరీని సందర్శించారు.ప్రతీ విద్యార్థికి అవసరమైన వైద్యసేవలను సత్వరం, సకాలంలో అందించాలని సూచించారు.
News October 13, 2025
జీవీఎంసీలో పీజీఆర్ఎస్కు 100 వినతులు

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 100 వినతులు వచ్చాయి. ఈ వినతులను జీవీఎంసీ అదనపు కమిషనరు డి.వి.రమణమూర్తి తీసుకున్నారు. ఇందులో అడ్మినిస్ట్రేషన్ విభాగమునకు 4, రెవెన్యూ 5, ప్రజారోగ్యం 6, పట్టణ ప్రణాళిక 58, ఇంజినీరింగు 22, మొక్కల విభాగం 1, యుసిడి 04 కలిపి మొత్తంగా 100 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.