News December 31, 2024
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా విడుదల
ఉమ్మడి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదాను ఎన్నికల అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సోమవారం విడుదల చేశారు. శ్రీకాకుళం విజయనగరం, మన్యం, పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాలో 21,555 ఓటర్లులో ఉన్నట్టు ముసాయిదాలో ప్రకటించారు. ఈ ముసాయిదాను వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. ఈ జాబితాను వివిధ రాజకీయ పార్టీలకు అందజేయనున్నారు.
Similar News
News January 26, 2025
విశాఖలో 446 మందికి పురస్కారాలు
76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విశాఖ జిల్లాలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న 446 మంది ఉద్యోగులు పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఉదయం నగరంలో గల పోలీస్ శాఖ మైదానంలో కలెక్టర్ చేతుల మీదుగా ఉద్యోగులు ఈ అవార్డులను అందుకోనున్నారు. అవార్డు అందుకోనున్న వారిలో విఎంఆర్డిఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథం, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్‌తో పాటు పలువురు ఉద్యోగులు ఉన్నారు.
News January 26, 2025
విశాఖ పోలీసుల అదుపులో స్పా నిర్వాహకులు?
విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో ఓ స్పా సెంటర్‌పై పోలీసుల దాడులు శనివారం రాత్రి దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఈ ఘటనలో పశ్చిమ బంగా, విశాఖకు చెందిన ముగ్గురు యువతులతో పాటు విటుడు, స్పా నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. స్పాకు నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. కాగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News January 26, 2025
పెందుర్తి: బాల్కనీ నుంచి జారిపడి వ్యక్తి మృతి
పెందుర్తిలో గల అప్పన్నపాలెంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న వెంకట సత్యనారాయణ ఇంటి బాల్కనీ నుంచి పడి మృతి చెందారు. వెంటనే భార్య హాస్పిటల్‌కు తరలించారు. తీవ్ర గాయాలవ్వడంతో అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. వెంకట సత్యనారాయణ జీవీఎంసీ జోన్ -8 వేపగుంట కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.