News February 13, 2025
ఉత్తరాంధ్ర టీచర్ MLC బరిలో 10 మంది

ఉత్తరాంధ్ర టీచర్ MLC స్థానానికి 10మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి హరేంధిర ప్రసాద్ తెలిపారు. 10మంది నామినేషన్ వెయ్యగా.. ఏ ఒక్కరూ ఉపసంహరించుకోలేదన్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న కౌంటింగ్ ఉండనుంది. 12 ఎంసీసీ బృందాలు, 11 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. నేర చరిత్ర లేనివారిని ఏజెంట్లుగా నియమించుకోవాలని సూచించారు.
Similar News
News December 24, 2025
విశాఖ: చిల్ట్రన్ ఎరీనా పార్క్ వివాదం.. ఆర్ఐ సస్పెండ్

విశాఖ చిల్డ్రన్ ఎరినాలో పార్క్ ఆర్ఐ కిరణ్ కుమార్ను కమిషన్ సస్పెండ్ చేశారు. మొన్న పార్టీలో చేరికల కార్యక్రమం కోసం వైసీపీ నాయకులు పార్క్ను చలానా కట్టి బుక్ చేసుకున్నారు. అయితే ఏరినా ఆవరణలో పార్టీ బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయకూడదని నిబంధన ఉన్నప్పటికీ ఆర్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చర్యలు తీసుకున్నారు. అయితే పర్మిషన్ ఇచ్చి చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారని వైసీపీ ఆందోళన చేయడంతో దుమారం రేగింది.
News December 24, 2025
విశాఖలో పోలీస్ అధికారిపై కేసు నమోదు

గాజువాక ట్రాఫిక్ స్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్న ఎంఎస్ఎన్ రాజు తమకు అధిక వడ్డీ ఆశ చూపి డబ్బులు తీసుకుని మోసం చేశారని ఐదుగురు కానిస్టేబుల్స్ గాజువాక స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తోటి ఉద్యోగుల నుంచి పలు దఫాలుగా 16 లక్షల వరకు అధిక వడ్డీలు ఇస్తానని నమ్మించి మోసం చేశారని సీఐ పార్థసారధికి ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి ఏఎస్సై కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు
News December 24, 2025
విశాఖలో 16వ శతాబ్ధం నాటి ఆనవాళ్లు!

విశాఖ మధురవాడ 7వ వార్డు పరిధి సుద్దగెడ్డ సమీపంలో టిడ్కో గృహాల వద్ద రహదారి విస్తరణ పనుల్లో బయటపడ్డ శ్రీరాముడి విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.ఫాల్గుణ రావు ఆధ్వర్యంలో బృందం స్థలాన్ని పరిశీలించి, ఈ విగ్రహం పురాతన రాతితో తయారైనదిగా, శైలి ఆధారంగా 16వ శతాబ్దానికి చెందినదిగా నిర్ధారించారు. మిగతా భాగం రాముని విగ్రహాలు కూడా ఇక్కడే ఉంటాయని అధికారులు భావిస్తున్నారు.


