News June 12, 2024
ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపడమే నా కర్తవ్యం: కొండపల్లి శ్రీనివాస్

కొండపల్లి శ్రీనివాస్ మంత్రి పదవి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సంవత్సరం క్రితం యువకులు రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. 4 నెలల క్రితం MLA టిక్కెట్ ఇస్తే బాధ్యతగా పనిచేసి గెలిచానన్నారు. ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం వలసపోతున్నారని, పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి వలసలను ఆపడమే కర్తవ్యంగా పనిచేస్తానని తెలిపారు.
Similar News
News November 8, 2025
VZM: ఈనెల 12న YSRCP ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12న జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నామని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం విజయనగరంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ చేపట్టామని ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. గత 17 నెలల్లో ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, మెడికల్ కాలేజీకి మాత్రం నిధులు కేటాయించలేకపోతోందని ప్రశ్నించారు.
News November 8, 2025
యాక్సిడెంట్.. ఇద్దరికి గాయాలు

విజయనగరం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు జమ్ము నారాయణపురం గ్రామం వద్ద ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా బైక్ నుజ్జునుజ్జు అయింది. గాయపడిన ఇద్దరిని 108లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు విజయనగరంలోని దాసన్నపేటకు చెందిన వారని స్థానికులు తెలిపారు.
News November 8, 2025
వసతి గృహంలో విద్యార్థులతో కలిసి ఎంపీ కలిశెట్టి రాత్రి బస

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన పుట్టిన రోజును శుక్రవారం పూసపాటిరేగ మండలం కొప్పెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి సాదాసీదాగా జరుపుకున్నారు. విద్యార్థులకు స్వయంగా వడ్డించి వారితో కలిసి భోజనం చేసిన ఎంపీ.. రాత్రి కూడా అక్కడే విద్యార్థుల మధ్య బస చేశారు. తన జన్మదిన వేడుకలు విద్యార్థుల మధ్య జరుపుకోవడం సంతృప్తినిచ్చిందని ఎంపీ పేర్కొన్నారు.


