News July 8, 2024
ఉత్తరాంధ్ర లయన్స్పై రాయలసీమ కింగ్స్ విజయం

విశాఖ వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం మధ్యాహ్నం ఏపీఎల్ సీజన్-3 మ్యాచ్లో ఉత్తరాంధ్ర లయన్స్- రాయలసీమ కింగ్స్ జట్లు తలబడ్డాయి. ఆరు వికెట్ల తేడాతో రాయలసీమ కింగ్స్ జట్టు విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 121 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తర్వాత రాయలసీమ కింగ్స్ 17.3 ఓవర్లలో ఆరు వికెట్ల ఆదిక్యంతో 122 పరుగులు చేసి గెలుపొందింది.
Similar News
News December 10, 2025
విశాఖలో టెట్ పరీక్షకు తొలిరోజు 91.05% హాజరు

విశాఖలో బుధవారం జరిగిన టెట్ పరీక్షకు మొత్తం 2001 మంది అభ్యర్థులకు గానూ 1822 మంది (91.05%) హాజరయ్యారు. పరీక్షల సరళిని డీఈవో స్వయంగా 2 కేంద్రాల్లో తనిఖీ చేయగా.. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం 5 కేంద్రాలను సందర్శించి పరిశీలించింది. ఉదయం 5 కేంద్రాల్లో, మధ్యాహ్నం ఒక కేంద్రంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు.
News December 10, 2025
ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి

ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి చెందింది. కంబాలకొండ నుంచి జింకలు తరచుగా రోడ్డుపైకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జింక రోడ్డుపైకి ఆకస్మికంగా రావడంతో, అటుగా వస్తున్న బస్సు ఢీకొంది. జింక అక్కడికక్కడే మృతి చెందింది. కంబాలకొండ అడవి నుంచి ఇలా రోడ్డెక్కిన జింకలు తరచుగా ప్రమాదాలకు గురై, తీవ్ర గాయాలు లేదా మరణం సంభవిస్తున్నాయి. మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
News December 10, 2025
విశాఖలో నేటి నుంచి ఎక్కడికక్కడ పనులు బంద్

జీవీఎంసీ పరిధిలో కాంట్రాక్టర్లు బుధవారం నుంచి పనులు నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నారు.18 నెలలు నుంచి కాంట్రాక్టర్లకు రూ.400 కోట్ల బకాయిలు ఉండగా బిల్లులు చెల్లించాలని పలు దఫాలుగా వినతులు ఇచ్చారు. మంగళవారం కమిషనర్కు నోటీసులు కూడా అందజేశారు. స్పందించకపోవడంతో నేటి నుంచి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోనూ కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు.


