News April 1, 2025
ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన ఖైరిగూడ ఓసీపీ

బెల్లంపల్లి ఏరియా ఖైరిగూడ ఆసీఫ్ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకుందని ఇన్ఛార్జ్ జీఎం నరేందర్ తెలిపారు. సింగరేణి సంస్థ ఏరియాకు 4.70 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించగా 5.43 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించిందన్నారు. ఉత్పత్తి శాతం 116గా నమోదైనట్లు చెప్పారు. అధికారులు, కార్మికులు సమష్టి కృషితో రానున్న రోజుల్లో మరిన్ని లక్ష్యాలను చేరుకుంటామన్నారు.
Similar News
News October 14, 2025
MBNR:PU.. 30కి పైగా కోర్సులు..157 కళాశాలలు

పాలమూరు వర్సిటీ 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం YSR ప్రారంభించగా.. 6 కోర్సుల్లో 180 మందితో మొదలైంది. ప్రస్తుతం దాదాపుగా 31 పైగా కోర్సులు, పాలమూరు వర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల్లో 16 వేలకు పైగా మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 157 కళాశాలలు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా వర్సిటీలో ఇంజినీరింగ్, లా కోర్సులు ప్రారంభమయ్యాయి. ఈనెల 16న స్నాతకోత్సవం సందర్భంగా.. ‘Way2News’ ప్రత్యేక కథనం.
News October 14, 2025
ట్రంప్‌కు 2026లోనైనా ‘శాంతి’ దక్కేనా?

8 యుద్ధాలు ఆపానని, తన కంటే అర్హుడు మరొకరు లేరని ఓ మినీ సైజ్ యుద్ధం చేసినా ట్రంప్‌కు 2025-నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. తాజాగా ఇజ్రాయెల్, పాక్ ఆయన్ను ఆ ప్రైజ్‌కు నామినేట్ చేశాయి. గడువులోగా నామినేషన్లు రాక ట్రంప్ పేరును నోబెల్ కమిటీ పరిగణనలోకి తీసుకొని విషయం తెలిసిందే. వచ్చే JAN31 వరకు గడువు ఉండటంతో 2026 రేసులో ట్రంప్ ముందున్నట్లు తెలుస్తోంది. 2026లోనైనా పీస్ ప్రైజ్ ఆయన్ను వరిస్తుందా? మీ COMMENT.
News October 14, 2025
రైతు జీవితానికి చిహ్నం!

ఒకప్పుడు రైతు జీవితానికి ప్రతీకగా ఉన్న ఎద్దులు నేటి కాలంలో కనుమరుగవుతున్నాయి. ట్రాక్టర్లు, యంత్ర వ్యవసాయం ప్రబలడంతో ఎద్దుల అవసరం తగ్గిపోయింది. పంట సీజన్లో మాత్రమే కొందరు రైతులు వాటిని ఉపయోగిస్తున్నారు. ఆధునికత పెరుగుతున్న కొద్దీ గ్రామీణ సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు క్రమంగా అంతరించిపోతున్నాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. మరి మీరు ఎద్దులతో సేద్యం చేశారా? కామెంట్ చేయండి..