News November 1, 2024

ఉదయగిరికి ఫస్ట్.. నెల్లూరు లాస్ట్ 

image

అపార్ నమోదులో జిల్లాలో ఉదయగిరి తొలి స్థానంలో నిలిచిందని MEO- 2 తోట శ్రీనివాసులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అపార్ నమోదులో జిల్లాలోని 38 మండలాలకు గాను ఉదయగిరి 58.76శాతంతో మొదటి స్థానం దక్కిందన్నారు. నెల్లూరు అర్బన్, రూరల్ చివరి స్థానాల్లో కొనసాగడం గమనార్హం. ఉదయగిరిని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన HM కార్యాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 23, 2025

కావలి: రైలు కింద పడి యువకుడి దుర్మరణం

image

కావలి జీఆర్‌పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొడవలూరు రైల్వే స్టేషన్ వద్ద సుమారు 20-25 ఏళ్ల వయసు గల యువకుడు రైలు కింద పడి దుర్మరణం చెందాడు. యువకుడు ఆరంజ్ కలర్ హాఫ్ హ్యాండ్ T షర్ట్, బ్లూ కలర్ కట్ బనియన్, బ్లూ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసినవారు కావలి జీఆర్‌పీ పోలీసులను సంప్రదించగలరు.

News November 23, 2025

నెల్లూరు: కీచక ఉపాధ్యాయుడి అరెస్ట్

image

వరికుంటపాడు(M) తూర్పు బోయమడుగుల ప్రాథమికోన్నత పాఠశాలలో ఓ కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జులై 1న పాఠశాలలోని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ నుంచి ఉపాధ్యాయుడు పరారు కావడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. టీచర్ ఆచూకీ కోసం పోలీసులు గాలించి శనివారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.

News November 23, 2025

అక్రమ లేవుట్లు, భవనాల క్రమబద్దీకరణకు గడువు పెంపు

image

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్న అక్రమలేవుట్లు, భవనాల క్రమబద్దీకరణకు NMC అధికారులు మరోసారి అవకాశం కల్పించారు. BPS పథకంలో భాగంగా 1985 నుంచి 2025 ఆగస్టు వరకు అనధికారికంగా, అనుమతికి మించి నిర్మించిన భవనాలను క్రమబద్దీకరించేందుకు వచ్చే ఏడాది మార్చి 11వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. పూర్తి వివరాలకు టోల్ ఫ్రీ నంబర్‌ 1800-425-1113, 7981651881 నంబర్లను సంప్రదించాలని కమిషనర్ నందన్ కోరారు.