News May 25, 2024
ఉదయగిరిలో కోడిగుడ్డు @ రూ.8
నిన్న మొన్నటి వరకు కోడి గుడ్డు ధర రూ.5ల వరకు ఉండగా నేడు ఎనిమిది రూపాయలకు ఎగబాకింది. ఎండాకాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవడంతో సరఫరా తగ్గి డిమాండ్ పెరిగిందని, రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు తెలిపారు. ప్రస్తుతం ఉదయగిరిలో 30 గుడ్లు రూ.200 పలుకుతున్నాయి. హోల్ సేల్లో ఒక కోడిగుడ్డు రూ.6.5లు కాగా రిటైల్ మార్కెట్లో రూ.8 రూపాయలు పలుకుతుంది.
Similar News
News January 22, 2025
కలెక్టర్ సమక్షంలో విద్యాశాఖ పునర్విభజన సన్నాహక సమావేశం
పాఠశాలల పునర్విభజన బోధన సిబ్బంది పునర్నిర్మాణం సన్నాహక సమావేశం నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ సమక్షంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోను తూచా తప్పకుండా పాటించాలని, గ్రామస్థుల సూచనలు, వారిని సమన్వయం చేయాలని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బాలాజీ రావు కొన్ని సూచనలు, మార్పులను ప్రతిపాదించారు.
News January 21, 2025
బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఇతనే
బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా సీపాన వంశీధర్ రెడ్డి మళ్లీ ఎన్నికయ్యారు. రాష్ట్ర, కేంద్ర నాయకత్వం వంశీధర్ రెడ్డిని ఎంపిక చేసిందని రాష్ట్ర పరిశీలకులు ప్రకటించారు. ఈ సందర్భంగా తిరిగి వంశీధర్ రెడ్డి ఎన్నిక పట్ల బీజేపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
News January 21, 2025
నెల్లూరులో ఇద్దరు సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు
నెల్లూరు జిల్లాలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను, నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసిన ఇద్దరు సర్పంచ్లపై కలెక్టర్ ఓ ఆనంద్ చర్యలు చేపట్టారు. కొడవలూరు మండలం పెమ్మారెడ్డి పాలెం పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, గతంలో పనిచేసిన మధుసూదన్, రేగడిచెలిక పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్లను సస్పెండ్ చేశారు. రేగడిచెలిక, పెమ్మారెడ్డి పాలెం సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేశారు.