News January 16, 2025

ఉదయగిరిలో జోరుగా కోడిపందేలు

image

సంక్రాంతి పండగ సందర్భంగా ఉదయగిరి మండలంలోని పలు గ్రామాల్లో జోరుగా కోడిపందేలు జరుగుతున్నాయి. పోలీసు అధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ బేఖాతర్ చేస్తూ కోడిపందేలు నిర్వహించారు. మండలంలోని జి. చెరువుపల్లి, జి చెర్లోపల్లి, వెంకట్రావుపల్లి, కృష్ణంపల్లి పలు గ్రామాల్లో ఏర్పాటుచేసిన కోడిపందేలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Similar News

News February 12, 2025

కావలి మనీ స్కాం వ్యవహారంలో ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

image

కావలి కేంద్రంగా స్టాక్ మార్కెట్ పేరుతో జరిగిన భారీ మనీ స్కాం వ్యవహారంలో ఇద్దరు కానిస్టేబుల్ పాత్ర ఉండటంతో సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయం ఆదేశాలు జారీ చేశారు. మనీ స్కాంలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఉన్నతాధికారుల విచారణ అనంతరం కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రాధాకృష్ణ, జ్యోతి అయోధ్య కుమార్ లను సస్పెండ్ చేశారు.

News February 12, 2025

నెల్లూరు: టెన్త్ అర్హతతో 63 ఉద్యోగాలు

image

టెన్త్ అర్హతతో నెల్లూరు డివిజన్‌లో 63 GDS పోస్టుల భర్తీకి భారత తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సైకిల్ లేదా బైక్ నడిపే సామర్థ్యం, వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వ తేదీలోగా https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News February 12, 2025

కావలిలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

image

కావలి పట్టణ శివారు ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికపై గుండెమడకల రమేశ్ (45) అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికులు కావలి వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. దీంతో ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!