News December 5, 2024
ఉదయగిరిలో పేలిన కుక్కర్

ఉదయగిరి పట్టణం కరీమా వీధిలోని ఓ గృహంలో మహిళ వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కుక్కర్ పేలింది. కుక్కర్ లో పప్పు ఉడికించేందుకు పెట్టి మహిళ ఇతర వంట పనులు చేసుకుంటుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కుక్కర్ పేలింది. ఈ ఘటనలో కుక్కర్‌తో పాటు గ్యాస్ స్టావ్ దెబ్బతిన్నాయి. మహిళకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
Similar News
News March 7, 2026
అబ్దుల్ అజీజ్ తల్లి మృతి.. మంత్రి సంతాపం

AP వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్ మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ X వేదికగా స్పందించారు. అన్వర్ జాన్ మృతిపట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలనీ అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నట్లు పోస్ట్ చేశారు.
News March 7, 2026
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: DMHO సుజాత

మహిళలు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా వైద్యాధికారి సుజాత అన్నారు. శనివారం వనంతోపు సెంటర్లోని జనహిత వాత్సల్య అనాధాశ్రమంలో మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ మహిళా ఉద్యోగులకు తేడా పోటీలు నిర్వహించి ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. అనాధ బాలల మధ్య ఈ వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
News March 7, 2026
పేదల సొంతింటిని పూర్తి చెయ్యడమే లక్ష్యం: నెల్లూరు కలెక్టర్

పేదలకు సొంత ఇంటిని పూర్తి చేసి ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా గృహనిర్మాణశాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణతో పని చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. శనివారం గృహనిర్మాణాల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.


