News December 15, 2024

ఉదయగిరిలో వెయ్యి మందికి పదవులు

image

ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ వ్యూహంతో 150 సాగునీటి సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ సాగునీటి సంఘాల ఎన్నికలలో సుమారు వెయ్యి మందికి పదవులు వచ్చినట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఎమ్మెల్యే తొలి అడుగులోనే ఉదయగిరి కోటపై టీడీపీ జెండా ఎగురవేసి, అనంతరం జరిగిన ఈ ఎన్నికలలో రెపరెపలాడించారు. ఇదే జోరుతో భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని నాయకులు ఘంటాపదంగా చెబుతున్నారు.

Similar News

News January 18, 2025

నెల్లూరు: 17 రోజుల్లో పది మంది మృతి

image

నెల్లూరు జిల్లాలో గడచిన 17 రోజుల్లో వివిధ కారణాలతో పదిమంది ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది ప్రేమ విఫలమై, కొంతమంది బెట్టింగ్లకు పాల్పడి, కొంతమంది వ్యక్తిగత సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా చిన్న చిన్న సమస్యలకే తనువు చాలించడం సరైంది కాదని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. మానసిక దృఢత్వం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.

News January 18, 2025

నెల్లూరు: ‘రిపబ్లిక్ డే వేడుకలు సమర్ధవంతంగా నిర్వహించాలి’

image

జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్, ఎస్పీ మణికంఠ, జేసీ శుభం బన్సల్ పాల్గొని మాట్లాడారు. ఈసారి జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

News January 18, 2025

నెల్లూరు: వైభవంగా రాపత్తు ఉత్సవాలు 

image

నెల్లూరు నగరం రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో రాపత్తు ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన శుక్రవారం దేవేరుల సమేత రంగనాథుడికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రంగనాథస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.