News November 15, 2024
ఉదయగిరిలో 11 మంది సచివాలయ సిబ్బందికి నోటీసులు

ఉదయగిరి మండలంలోని పలు సచివాలయాల్లో పనిచేస్తున్న 11మంది సచివాలయ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు ఎంపీడీవో అప్పాజీ షోకాజు నోటీసులు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. షోకాజు నోటీసులు అందుకున్న వారిలో ఎనర్జీ, వెటర్నరీ, వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళ పోలీసు, వీఆర్ఓ, ఏఎన్ఎంలు ఉన్నారని, వీరంతా మూడు రోజుల్లోపు వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
నెల్లూరుకు అన్యాయం.. ‘పెద్దారెడ్లు’ఏం చేస్తున్నారో.!

జిల్లా పునర్విభజనతో సింహపురి వాసులు మనోవేదనకు గురవుతున్నారు. గూడూరు అయినా జిల్లాలో కలుస్తుందనే ఆశలు నీరుగారాయి. రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను గూడూరు రెవెన్యూ డివిజన్లో కలిపి తిరుపతిలో చేర్చారు. ఇంత జరుగుతున్నా ‘<<18401742>>నెల్లూరు పెద్దారెడ్లు<<>>’గా చెప్పుకొనే నేతలు ఏం చేస్తున్నారన్నది పెద్ద ప్రశ్న. దీనిపై వారు ఎందుకు ప్రశ్నించడం లేదు.? రాజకీయ భవిష్యత్తు కోసమేనా? అని ప్రజలు చర్చించుకుంటున్నారట.
News November 27, 2025
నెల్లూరు జిల్లాకు కన్నీటిని మిగిల్చిన పునర్విభజన

పెంచలకోన, శ్రీహరికోట, ఫ్లెమింగో ఫెస్టివల్..జిల్లా శిగలో మణిహారాలు. వీటితో నిత్యం <<18390784>>జిల్లా<<>> పర్యాటకులతో సందడిగా ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత కథ మారింది. <<18390350>>3 నియోజకవర్గాలను<<>> తిరుపతిలో కలపడంతో చెంగాలమ్మ టెంపుల్, శ్రీసిటి, వెంకటగిరి జాతర, దుగ్గరాజపట్నం పోర్ట్ వంటి ప్రఖ్యాత ప్రదేశాలు వెళ్లిపోయాయని రొట్టెలపండుగ తప్ప <<18391147>>ఇంకేమీ<<>> మిగిలిదంటూ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News November 27, 2025
నెల్లూరు: ఫ్రీగా స్కూటీలు.. 30న లాస్ట్.!

దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 30 వరకు ప్రభుత్వం దరఖాస్తుల గడువును పొడిగించింది. 10పాసై, ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారు ఇందుకు అర్హులు. జిల్లాలో ఇప్పటి వరకు 70 మంది అప్లై చేసుకున్నట్లు ఏడీ ఆయుబ్ తెలిపారు. అర్హులు APDASCELC.AP.GOVలో దరఖాస్తులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులు కోరారు.


