News November 15, 2024
ఉదయగిరిలో 11 మంది సచివాలయ సిబ్బందికి నోటీసులు
ఉదయగిరి మండలంలోని పలు సచివాలయాల్లో పనిచేస్తున్న 11మంది సచివాలయ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించినందుకు ఎంపీడీవో అప్పాజీ షోకాజు నోటీసులు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. షోకాజు నోటీసులు అందుకున్న వారిలో ఎనర్జీ, వెటర్నరీ, వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళ పోలీసు, వీఆర్ఓ, ఏఎన్ఎంలు ఉన్నారని, వీరంతా మూడు రోజుల్లోపు వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.
Similar News
News December 6, 2024
నెల్లూరు జిల్లాలో ‘పుష్ప-2’ అరుదైన రికార్డ్
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా నెల్లూరు జిల్లాలో ఓ అరుదైన రికార్డ్ నమోదు చేసింది. జిల్లా వ్యాప్తంగా 58 థియేటర్లలో ప్రీమియర్స్‌తో కలిపి మొదటి రోజు పూర్తి అయ్యే సమయానికి ఒక్కో థియేటర్‌లో 8 షోల చొప్పున 464 షోలు ప్రదర్శితమయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. దీంతో మొదటి రోజు నుంచే ‘పుష్ప-2’ రికార్డులు మొదలయ్యాయని అభిమానులు సంబరపడుతున్నారు.
News December 6, 2024
పండగ వాతావరణంలో మెగా PTM ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
డిసెంబర్ 7న నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ ఏర్పాటుకు సంబంధించి పూర్తి చేసినట్లు కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా పండగ వాతావరణంలో జరిగేలా ఇప్పటికే సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రేపటి నుంచి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News December 5, 2024
నాయుడుపేటలో సినీ నటుడు సత్య ప్రకాశ్ పూజలు
నాయుడుపేటలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవాలయం, ఉమామహేశ్వర దేవాలయాలను గురువారం ప్రముఖ సినీ నటుడు సత్య ప్రకాశ్ దర్శించుకొని, పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన కుటుంబ సభ్యులతో విచ్చేశారు. ఈ దేవాలయాల సందర్శన పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల, శ్రీశైలం క్షేత్రంను దర్శించుకున్నట్లు ఉందని సత్య ప్రకాశ్ అన్నారు.