News August 25, 2024
ఉదయగిరి కొండపై మంటలు (PHOTO)
ఉదయగిరి పట్టణ శివారులోని దుర్గం కొండపై ఆదివారం రాత్రి మంటలు వచ్చాయి. వన్య ప్రాణులకు ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఈ కొండకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వన భోజనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆకతాయిలు ఎవరైనా సిగరెట్ పడేసి ఉంటారని లేదా పొయ్యి వెలిగించి చల్లార్చకపోవడంతో మంటలు వచ్చి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 22, 2025
కాకాణిపై మరో కేసు నమోదు.. పదికి చేరిన కేసుల సంఖ్య
నెల్లూరు జిల్లా YCP అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కావలిలో మరో కేసు నమోదైంది. ఇటీవల జరిగిన ఘర్షణలో గాయపడిన వైసీపీ నాయకుడిని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన పోలీసులపై అనుచితంగా మాట్లాడారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో ఇప్పటికే వెంకటాచలం, ముత్తుకూరు, పొదలకూరు, కావలి ప్రాంతాలలో కేసులు నమోదు కావడంతో ఇప్పటి వరకు పది కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
News January 22, 2025
బుచ్చి మండలంలో అమానుష ఘటన
ఓ కసాయి తండ్రి తన బిడ్డలను అమ్ముకున్న ఘటన బుచ్చి(M) మినగల్లులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. పేడూరు రవి, వెంకమ్మ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల. మొదటగా పుట్టిన మగ బిడ్డను ఐదేళ్ల క్రితం లక్ష రూపాయలకు అమ్మేశారు. రెండు రోజుల క్రితం మరో మగ బిడ్డను రవి హైదరాబాద్‌కు తీసుకెళ్లి అమ్మాడని వెంకమ్మ తెలిపింది. దీంతో సర్పంచ్ పూజిత ఎంపీడీవో శ్రీహరికి ఫిర్యాదు చేశారు.
News January 22, 2025
మలేషియా జైలులో నెల్లూరు జిల్లా యువకులు
తిరుపతిలోని ట్రావెల్ ఏజెంట్ల మోసంతో ఇద్దరు యువకులు మలేషియా జైల్లో ఉన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్లకు చెందిన పవన్, సింహాద్రి అనే యువకులను టూరిస్ట్ వీరస్వామి మాయమాటలతో వర్కింగ్ పర్మిట్ మీద మలేషియా పంపాడు. వీరిద్దరూ అక్కడి హోటల్లో పనిచేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మూడు నెలల నుంచి ఆచూకీ లేదని తమ బిడ్డలను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని బాధితుల తల్లిదండ్రులు కోరారు.