News February 16, 2026

ఉదయగిరి జూనియర్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

ఉదయగిరి ARR ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణానికి చెందిన జన్నత్ అనే యువకుడు నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతి చెందిన వ్యక్తి ఉదయగిరి ఉపసర్పంచ్ షేక్ ముత్తూజా హుస్సేన్ తమ్ముడుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 14, 2026

నెల్లూరు జిల్లాలో పెరిగిన నూనె ధరలు

image

యుద్ధ ప్రభావం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై చూపుతోంది. ఇప్పటికే గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు వంట నూనె ధరలు కలవరపెడుతున్నాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ నూనెలు కిలోకు రూ.10 నుంచి 15 రూపాయల మేర పెరిగాయి. నెల్లూరు జిల్లాలో రోజుకు సుమారు 4 లక్షల లీటర్లకు పైగా వంట నూనెల వినియోగం జరుగుతోంది. దేశంలో వంట నూనెలు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

News March 14, 2026

నెల్లూరు: కిరోసిన్ అయినా ఇవ్వండి సార్..!

image

నెల్లూరు జిల్లాలో ఇండియన్ గ్యాస్ సిలిండర్లు బుకింగ్ కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుకింగ్ సర్వర్ పనిచేయకపోవడంతో చాలా మంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ లేక ఇళ్లలో అవస్థలు పడుతున్నామని.. సమస్య పరిష్కారమయ్యే వరకు తాత్కాలికంగా కిరోసిన్ సరఫరా చేయాలని ప్రజలు జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు.

News March 14, 2026

షాకింగ్.. నెల్లూరు జిల్లాలో భారీగా పెరిగిన ధరలు

image

యుద్ధం ఎఫెక్ట్‌తో నెల్లూరు జిల్లా నుంచి నిమ్మ, గుడ్లు ఎగుమతులు పడిపోయాయి. దీంతో వాటి ధరలు తగ్గిపోయాయి. ఇదే సమయంలో చికెన్ ధర రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా నెల్లూరులో శనివారం బాయిలర్ కోడి ధర రూ.175 పలికింది. స్కిన్‌తో కూడిన కేజీ చికెన్ రూ.304, స్కిన్ లెస్ రూ.334గా ఉంది. డిసెంబర్, జనవరిలో కోళ్లకు వైరస్ వచ్చి చనిపోవడంతో ధరలు పెరిగాయని.. రంజాన్‌కు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.