News February 6, 2025

ఉదయగిరి: సీనియర్ అధ్యాపకుడు గుండెపోటుతో మృతి

image

ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో పలు కళాశాలల్లో పనిచేసిన సీనియర్ అధ్యాపకుడు బి శ్రావణ్ కుమార్ ప్రస్తుతం ఓ ప్రైవేటు కళాశాల ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్నారు. గత రాత్రి దాసరిపల్లిలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి భోజనం తర్వాత ఛాతిలో నొప్పి రావడంతో ఉదయగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరుకు తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News December 27, 2025

నెల్లూరులో ఫేక్ ITCలతో రూ. 43 కోట్ల టోకరా !

image

నెల్లూరులో పెద్ద పెద్ద కంపెనీలు పన్నుల ఎగవేతకు కొత్త పంథాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ జేసీ కిరణకుమార్ Way2Newsతో మాట్లాడుతూ.. నెల్లూరు డివిజన్ పరిధిలో రూ. 43 కోట్ల మేరా ఫేక్ ITC లను తీసుకున్నారని తెలిపారు. 8 సంస్థలపై కేసులు నమోదు చేశామని, ఇందులో ఐదుగురిపై కేసులు నమోదు చేయగా.. ముగ్గురు 10% డిమాండ్ కట్టి అప్పీల్ కి వెళ్లారని వివరించారు.

News December 27, 2025

నెల్లూరు: ‘తెలుగు తమ్ముళ్లు’ మధ్య అసమ్మతి సెగలు

image

పంచాయతీ నిధులు వ్యవహారంలో తెలుగు తమ్ముళ్లు మధ్య విద్వేషాలు రేగుతున్నాయి. తాజాగా వింజమూరు MPDO ఆఫీసులో జరిగిన సర్వ సభ్య సమావేశంలో గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనుల వ్యవహారంలో మండల కన్వీనర్ గూడా నరసింహారెడ్డికి, ZPTC బాలకృష్ణారెడ్డికి మధ్య గొడవ రాజుకుంది. నిధుల వ్యవహారంలో పార్టీ నాయకుల మధ్య గొడవలు జరగడం పంచాయతీ ఎన్నికలపై ప్రభావం చూపనుంది.

News December 27, 2025

నెల్లూరులో కలవనున్న గూడూరు?

image

జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష చేశారు. సమీక్షలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పొంగూరు నారాయణ పాల్గొన్నారు. స్థానిక నేతల విజ్ఞప్తితో గూడూరును నెల్లూరులో కలిపే అంశంపై కసరత్తు చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.