News January 31, 2025
ఉదయాన్నే ముస్తాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం

ఉదయం ముస్తాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సామాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 18, 2025
వరంగల్: అర్ధరాత్రి రైల్వే స్టేషన్, బస్టాండ్లో పోలీస్ తనిఖీలు

నేరాల నియంత్రణ, నేరస్థులను గుర్తించే చర్యల్లో భాగంగా సోమవారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్ స్పర్జన్ రాజ్ సిబ్బందితో కలిసి వరంగల్, హన్మకొండ బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లలో అనుమానిత వ్యక్తులు, వారి బ్యాగులను తనిఖీ చేశారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

కార్గో రవాణాలో వాల్తేరు రైల్వే డివిజన్ సరికొత్త రికార్డు

వస్తు రవాణాలో మరో మైలురాయిని నమోదు చేస్తూ వాల్తేరు రైల్వే డివిజన్ దేశవ్యాప్తంగా 5వ స్థానంలో నిలిచింది. 230 రోజుల్లో 50M టన్నుల సరకు రవాణాతో డివిజన్ చరిత్రలోనే అత్యున్నత రికార్డు సాధించింది. గత ఏడాదితో పోలిస్తే 12.5% పెరుగుదల నమోదైందని రైల్వే శాఖ ప్రకటించింది. స్టీల్ప్లాంట్, HPCL, విశాఖ పోర్ట్, గంగవరం పోర్ట్ వంటి కీలక లోడింగ్ పాయింట్లలో సదుపాయాల విస్తరణ, కార్యకలాపాల వేగవంతమే కారణమని తెలిపింది.