News January 31, 2025
ఉదయాన్నే ముస్తాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం

ఉదయం ముస్తాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద కారు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సామాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 19, 2025
శ్రీలత రెడ్డికి సూర్యాపేట బీజేపీ పగ్గాలు!

BJP జిల్లా అధ్యక్షురాలిగా శ్రీలతరెడ్డిని రాష్ట్ర పార్టీ నియమించింది. ఈ మేరకు సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలిగా ఆమె పేరును మంగళవారం ప్రకటించింది. నేరేడుచర్లకు చెందిన శ్రీలతరెడ్డి 2023లో BRS నుంచి BJPలో చేరి హుజుర్‌నగర్ నుంచి BJP అభ్యర్థిగా నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఇప్పటికే NLG జిల్లా BJP అధ్యక్షుడిగా వర్షిత్‌రెడ్డి, యాదాద్రిభువనగిరి అధ్యక్షుడిగా అశోక్ గౌడ్‌ని పార్టీ నియమించిన విషయం తెలిసిందే.
News February 19, 2025
HYDలో 3 లక్షల మంది AI నిపుణులు: మంత్రి

ప్రపంచ నగరాలు టెక్నాలజీ అంటే HYD నగరం వైపే చూసేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర IT మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. HYDలో సమ్మిట్లో పాల్గొన్న మంత్రి, HYDలో 1500కు పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయని, వీటిలో 15 లక్షల మందికిపైగా పనిచేస్తున్నారని తెలిపారు. వీరిలో 3 లక్షల మంది AI నిపుణులు, లక్ష మంది చిప్ డిజైనర్లు ఉన్నట్లుగా తెలిపారు.
News February 19, 2025
పంగులూరు వద్ద ప్రమాదం.. వ్యక్తి మృతి

బాపట్ల జిల్లా పంగులూరు మండలం కొప్పెరపాడు శివారులో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి బైక్ పైనుంచి కిందపడినట్లు సమాచారం. గమనించిన స్థానికులు అతణ్ని వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అయితే మృతుని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.