News September 3, 2024
ఉద్దానంలో పరిశోధనలు ప్రారంభం

ఉద్దానంలో కిడ్నీ వ్యాధిపై ఇంటర్నేషనల్ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ లెక్స్ వాన్ జీన్ సోమవారం పలాసకు వచ్చారు. కాశీబుగ్గ కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో పరిశోధనలు చేయనున్న టీంకు ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో పరిశోధనకు అవసరమైన పరికరాలను సైతం జీన్ అమెరికా నుంచే తీసుకువచ్చారు. స్థానికంగా ఉన్న నీరు, ధూళిపై పరిశోధనలు చేస్తారు.
Similar News
News December 13, 2025
శ్రీకాకుళం: ‘లక్ష్యానికి దూరంగా ధాన్యం సేకరణ’

జిల్లాలో 30 మండలాల్లో ధాన్యం కొనుగోలు కోసం 406 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 6,50,000 మెట్రిక్ టన్నులు సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. సంక్రాంతి లోపు వరి ధాన్యం నూర్పులు పూర్తి చేసి అమ్మటం రైతుల ఆనవాయితీ. ప్రస్తుతం పొలాల్లో వరి కుప్పలు దర్శనమిస్తున్నాయి. ధాన్యం అమ్మకం దళారులపై ఆధారపడే పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాల అమలు కావటం లేదని రైతులు అంటున్నారు.
News December 13, 2025
సంతబొమ్మాళి: రాకాసి అలలు..ప్రాణాలు తీశాయి

చేపల వేటకెళ్లిన మత్స్యకారుడు మృతి చెందిన ఘటన సంతబొమ్మాళి(M) భావనపాడులో శనివారం ఉదయం జరిగింది. తోటి జాలర్లతో వేటకెళ్లిన రాజయ్య(60) బలమైన కెరటాలకు తెప్ప నుంచి ప్రమాదవశాత్తూ సముద్రంలోకి పడిపోయాడు. పక్కనే ఉన్నవారు అప్రమత్తమై కాపాడేలోపే రాకాసి అలల తాకిడికి తనువు చాలించాడు. అనంతరం డెడ్ బాడీని ఒడ్డుకు తీసుకురాగా..సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
News December 13, 2025
కంచిలి: రైలు ఢీకొని టెన్త్ విద్యార్థిని మృతి

కంచిలి మండలంలో గురువారం రాత్రి వందే భారత్ రైలు ఢీకొని పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. పలాస జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కంచిలి పట్టణం బలియాపుట్టుగ కాలనీకి చెందిన సాలిన గంగోత్రిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి నిర్ధారించుకున్నారు. దీనిపై కేసు నమోదైంది.


