News September 21, 2024
ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ: మంత్రి కొండా

అణచివేతపై ధిక్కార స్వరం, ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. సెప్టెంబర్ 21న కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి సందర్భంగా దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం తన జీవితాన్ని ధారపోసిన ఆయన త్యాగ నిరతిని మంత్రి కొండా సురేఖ స్మరించుకున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తుందని మంత్రి అన్నారు.
Similar News
News December 13, 2025
రేపు వరంగల్‌లో టఫ్ ఫైట్..!

జిల్లాలో 117 పంచాయతీలకు ఆదివారం జరిగే రెండో విడతపై ఉత్కంఠ నెలకొంది. దుగ్గొండి 33, గీసుగొండ 19, నల్లబెల్లి 29, సంగెం 30 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. 117 జీపీలకు ఇప్పటికే 5 ఏకగ్రీవమయ్యాయి. నల్లబెల్లి, దుగ్గొండిలో ఎన్నికలపై BRS, కాంగ్రెస్ నేతలు నువ్వా నేనా? అన్నట్లు ఉండగా, గీసుగొండలో కొండా కాంగ్రెస్, రేవూరి కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. సంగెంలో పాగా వేసేందుకు చల్లా, రేవూరి వర్గాల మధ్య ఆసక్తికర పోటీ ఉంది.
News December 12, 2025
వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో కొత్త సమీకరణలు!

WGL తూర్పు కాంగ్రెస్‌లో రాజకీయ వేడి పెరుగుతోంది. జిల్లా అధ్యక్షుడి మార్పుతో సమీకరణాలు మారిపోతుండగా, కొండా దంపతుల అనుచరుడి ఇంట్లో నేతల మధ్య అంతర్గత చర్చలు జరిగాయి.సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో ఒక్కటైన తూర్పు నేతలు జిల్లా పార్టీ పదవులపై మంతనాలు జరిపినట్లు సమాచారం. నల్గొండ రమేశ్ ఇంట్లో మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి సారయ్య భేటీ అయ్యారు. కీలక నేతలు త్వరలో రాష్ట్ర అధిష్టానాన్ని కలవనున్నట్లు తెలుస్తోంది.
News December 12, 2025
వరంగల్ జిల్లాలో FINAL పోలింగ్ శాతం

జిల్లాలో 91 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రం లోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 86.83 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.


