News August 15, 2024

ఉద్యమ జిల్లా.. మన ఓరుగల్లు

image

ఓవైపు దేశం స్వాతంత్ర్యం కోసం పోరాడితే తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం పాలనలో ఉంది. ఆ సమయంలో రజాకార్ల అరాచకాలకు నిప్పు కణికలై ఎదురునిలిచిన ఓరుగల్లు పోరాట యోధులు ఎందరో ఉన్నారు. పరకాల, బైరాన్‌పల్లి, పాలకుర్తి, పెద్దముప్పారం వంటి ప్రాంతాల్లో నాటి తుపాకులకు బెదరకుండా బరిసెలు, రాళ్లతో దాడికిదిగి చివరకు ప్రాణ త్యాగం చేసిన వీరులు కోకొల్లలు. అక్రమ అరెస్టులతో కారాగారంలో మగ్గినా ఉద్యమ స్ఫూర్తిని మాత్రం వదలలేదు.

Similar News

News September 18, 2024

రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రి కొండా సురేఖ

image

రాష్టంలోని పలు దేవాలయాల అభివృద్ధి, సౌకర్యాల కల్పన, తదితర అంశాలపై సెక్రటేరియట్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు, వైటిడిఎ వైస్ చైర్మన్ కిషన్ రావు, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News September 18, 2024

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మెదక్ ఎంపీ

image

వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రకాళి అమ్మవారిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీకి అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వరంగల్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన మెదక్ ఎంపీకి స్థానిక బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

News September 18, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7,810

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర తగ్గింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,860 పలకగా.. ఈరోజు రూ.7,810కి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని చెబుతున్నారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.