News December 30, 2024

ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపే మాటలు నమ్మొద్దు..ఎస్పీ సూచన

image

పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ కల్పించే దళారీలు మాటలు నమ్మవద్దని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేసే వారి సమాచారాన్ని ఫోన్ నెంబర్ 9550351100 కి తెలపాలని, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు.

Similar News

News January 18, 2025

జర్మనీ అబ్బాయి, ఏలూరు జిల్లా అమ్మాయి నిశ్చితార్థ వేడుక 

image

దేశాలు దాటిన ప్రేమ పెళ్లిగా మారిన అపూర్వ ఘటన టీ.నర్సాపురం మండలం ఏపుగుంటలో గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఏపుగుంటకు చెందిన లావణ్య జర్మనీలో ఉద్యోగ రీత్యా పనిచేస్తున్న సమయంలో మార్కస్, లావణ్యల మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. దీంతో ఇవాళ గ్రామంలో వీరి నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. వివాహం జర్మనీలో జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.

News January 18, 2025

ఏలూరు: చనిపోయిన కోడికి వేలం..రూ. లక్ష

image

సంక్రాంతి కోడిపందేల బరిలో మృతి చెందిన ఓ కోడికి యజమానులు వేలంపాట నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే జాలిపూడికి చెందిన నవీన్ చంద్రబోస్ వేలంపాటలో పాల్గొన్నారు. రూ.1,11,111 వెచ్చించి కోడిని దక్కించుకున్నారు. ఈ వేలం పాటకు అధిక సంఖ్యలో జనం పోటీ పడగా చంద్రబోస్ గెలుపొందారు.

News January 18, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ బుల్లి రాజుది మన ఏలూరే

image

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలోని బుల్లి రాజు క్యారెక్టర్‌తో అందరినీ అలరించిన రేవంత్ ఏలూరు జిల్లా నిడమర్రు మండలం చానమిల్లి గ్రామానికి చెందిన రొయ్యల వ్యాపారి భీమాల శ్రీనివాస రావు కుమారుడు. రేవంత్ ‘సంక్రాంతికి వస్తున్నాం’లో వెంకటేశ్‌కి కొడుకుగా నటించే ఛాన్స్ కొట్టేశాడు. 11 సంవత్సరాల వయసులో సినిమా ఇండస్ట్రీకి కొత్తైనా తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.