News March 7, 2025
ఉద్యోగాల్లో స్థానికులకు 20 శాతం ఇస్తాం: భరత్

AKP జిల్లాలో రూ.1,47,162 కోట్ల పెట్టుబడితో ప్రైవేట్ రంగంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తునన్నట్లు ఇండ్రస్టీయల్ మినిస్టర్ భరత్ ప్రకటించారు. సభలో గురువారం కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడారు. రెండు దశల్లో ఆర్సిలర్ మిట్టల్ సంస్థ పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఉక్కు కర్మాగారంలో ఉద్యోగాల్లో స్థానికులకు 20 శాతం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు.
Similar News
News December 5, 2025
పుతిన్‌కు ‘బాడీ డబుల్స్’ ఉన్నారా?

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఆయన ‘బాడీ డబుల్స్’ గురించి చర్చ జరుగుతోంది. బహిరంగ కార్యక్రమాలు, ప్రయాణాలకు బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తారని ఊహాగానాలు ఉన్నాయి. పుతిన్‌కు ముగ్గురు డూప్స్ ఉన్నారని ఉక్రెయిన్ గతంలో చెప్పింది. వారు ‘క్లోన్ ఆర్మీ’ అని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే అవన్నీ అవాస్తవాలని, ‘బాడీ డబుల్’ ప్రతిపాదనలను తాను తిరస్కరించానని గతంలో పుతిన్ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.
News December 5, 2025
NRPT: మూడోదశ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రారంభం

నారాయణపేట జిల్లాలోని మాగనూర్, కృష్ణ, ఉట్కూర్, మక్తల్, నర్వ మండలాల పరిధిలో సర్పంచ్, వార్డులకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ ఐదు మండలాల్లో కలిపి 110 గ్రామపంచాయతీలు, 994 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో డిసెంబర్ 17న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల ఓటింగ్ వేయడానికి అవకాశం కల్పించి మధ్యాహ్నం 02 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభిస్తారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
News December 5, 2025
నల్గొండ: పంచాయతీ ఎన్నికల్లో ఇంటి పోరు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఇంటిపోరు తలనొప్పిగా మారింది.పలు గ్రామాల్లో ఒక్కో పార్టీ నుంచి ఇద్దరి నుంచి ముగ్గురిపైనే సర్పంచ్ స్థానాలకు పోటీ పడుతున్నారు. పెద్దఎత్తున నామినేషన్లు రావడంతో కొందరు విత్ డ్రా చేసుకున్నప్పటికీ మరికొందరు నేతలు విరమించేందుకు యత్నాలు చేసినా పట్టించుకోవడం లేదు. చాలాచోట్ల ఒకే పార్టీకి చెందిన అభ్యర్థులు రంగంలోకి దిగారు.


