News August 22, 2024

ఉద్యోగులంటే చంద్రబాబుకు చిరాకు: శ్రీకాంత్ రెడ్డి

image

ఉద్యోగులంటే చంద్రబాబుకు చిరాకు అని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ ఆరోపించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం.. శాడిస్ట్ ప్రభుత్వంలా వ్యవహరిస్తోందని, ప్రభుత్వ ఉద్యోగులను వేధింపులు గురి చేస్తోందన్నారు. సరిగ్గా 2019కు ముందు ఉద్యోగులనుద్దేశించి ఆంధ్రజ్యోతి రాధాకష్ణ, చంద్రబాబు మధ్య జరిగిన వీడియో సంభాషణ ఎన్ని తరాలైనా మరిచిపోలేమని తెలిపారు.

Similar News

News September 12, 2024

కడప: వృత్తి ధర్మాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి

image

వృత్తి ధర్మాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తించడంతోపాటు మన ప్రాణాలకు ముప్పు రాకుండా విధి నిర్వహణను బాధ్యతను నిర్వర్తించాలని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్ రెడ్డి సంయుక్తంగా పేర్కొన్నారు. జాతీయ అటవీశాఖ అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా కడపలో కార్యక్రమం నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.

News September 11, 2024

కడప: LLB తొలి సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని లా కళాశాలల్లో చదువుతున్న ఐదేళ్ల LLB మొదటి సెమిస్టర్, మూడేళ్ల LLB మొదటి సెమిస్టర్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య కె. కృష్ణారెడ్డి, కుల సచివులు ఆచార్య ఎస్ రఘునాథ్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య ఎన్. ఈశ్వర్ రెడ్డితో కలసి విడుదల చేశారు. తక్కువ కాలంలోనే ఫలితాలు విడుదలకు కృషి చేసిన పరీక్షల విభాగాన్ని వీసీ అభినందించారు.

News September 11, 2024

చింతకొమ్మదిన్నె: వైవీయూలో విద్యార్థుల మధ్య ఘర్షణ

image

యోగి వేమన విశ్వవిద్యాలయంలో బుధవారం ఉదయం విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. విద్యార్థుల ఘర్షణకు లవ్ లెటర్ కారణమని తెలుస్తోంది. వివరాలలోకి వెళితే.. కళాశాలలో ఇంటిగ్రేటెడ్ కోర్స్ విద్యార్థిని మైక్రో బయాలజీ విద్యార్థులు తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. దెబ్బలు తిన్న విద్యార్థి బంధువులను పిలిపించి గాయపరిచిన వారిపై దాడి చేసే సందర్భంలో వారు యూనివర్సిటీ గెస్ట్ హౌస్‌లో తల దాచుకున్నారని సమాచారం.