News December 13, 2024

ఉద్యోగులు మనసు పెట్టి పనిచేయాలి: మంత్రి తుమ్మల

image

ఖమ్మం మున్సిపల్ ఉద్యోగులు మనసు పెట్టి పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగారన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్ ఉద్యోగులు మనసుపెట్టి విధులు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయని అధికారులు ఇంటికి వెళ్లాల్సి వస్తోందని మంత్రి తుమ్మల హెచ్చరించారు. గతంలో ఎవరి ఒత్తిళ్ల వల్ల తప్పు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని మంత్రి సూచించారు. 

Similar News

News January 10, 2026

KMM: చిరుత దహనంపై ‘నిశ్శబ్ద’ దర్యాప్తు.. నిందితులెవరు?

image

ఖమ్మం జిల్లా పులి గుండాల అటవీ ప్రాంతంలో చిరుతపులి కళేబరం దహనం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఉదంతంలో ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినప్పటికీ, విచారణ మాత్రం నత్తనడకన సాగుతోంది. అసలు ఏడాది కాలంగా ఈ విషయాన్ని ఎందుకు దాచారు? చిరుత గోళ్లు, చర్మం ఏమయ్యాయి? అనే ప్రశ్నలు మిస్టరీగా మారాయి. అటవీశాఖలో అధికారుల మార్పులు జరుగుతున్నా, ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News January 10, 2026

KMM: 35,188 మంది విద్యార్థులు.. 66 పరీక్షా కేంద్రాలు

image

ఖమ్మం జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగే ఇంటర్ థియరీ పరీక్షలకు 66 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 35,188 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, సీసీలు, పారా మెడికల్ సిబ్బంది ఉండాలన్నారు.

News January 9, 2026

ఖమ్మం జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో యాసంగి సాగు అవసరాలకు తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 10,942 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉందని, ఇప్పటి వరకు రైతులకు 36,314 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు వెల్లడించారు. రైతులు యూరియా కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.