News June 12, 2024
ఉద్యోగుల సమస్యల పట్ల సీఎం సానుకూలం: టీఎన్జీవో

ఉద్యోగుల అన్ని రకాల సమస్యల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దశలవారీగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రిని ఉద్యోగుల సమస్యలు లేవనెత్తగా పైవిధంగా స్పందించారని తెలిపారు.
Similar News
News March 27, 2025
MDK: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం MDK, SRD, SDPT డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు.జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.
News March 27, 2025
మెదక్: నేడే ఆఖరు.. సబ్సిడీపై సాగు పరికరాలు

ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై పరికరాలను అందిస్తోందని, నేడే చివరి తేది అని అధికారులు తెలిపారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు 2024-25 సంవత్సరానికి పరికరాలను అందించడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించారు. అర్హులను ఎంపిక చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పట్టా పాస్ పుస్తకం కలిగిన ఎస్సీ, ఎస్టీ, జనరల్ మహిళలు మాత్రమే అర్హులు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, జనరల్ రైతులకు 40 శాతం రాయితీ ఉంటుందన్నారు.
News March 26, 2025
MDK: హామీలను అమలు చేసే వరకు వదిలే ప్రసక్తే లేదు: హరీశ్ రావు

కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మంగళవారం మెదక్‌లో మాట్లాడుతూ.. రుణమాఫీ చేసిందని ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని, రుణమాఫీ కాని రైతులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెట్టి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు అండగా బీఆర్ఎస్ ఉంటుందన్నారు.