News July 5, 2024
ఉద్యోగ నియామక పత్రాలు అందించిన మంత్రి తుమ్మల

టీజీపీఎస్సీ ద్వారా ఇటీవల రిక్రూట్ అయిన 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్స్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియామక పత్రాలు అందజేశారు. వ్యవసాయ రంగంలో మంచి మార్పులు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
Similar News
News April 5, 2026
ఖమ్మం జిల్లాలో 8న పాడైన చక్కెర వేలం

ఖమ్మం జిల్లాలోని గోదాముల్లో నిల్వ ఉన్న, వినియోగానికి పనికిరాని చక్కెరను వేలం వేయనున్నట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీలత తెలిపారు. ఈనెల 8న ఖమ్మం అర్బన్, 9న నేలకొండపల్లి, వైరా, 10న ఏన్కూరు, సత్తుపల్లి కేంద్రాల్లో వేలం నిర్వహించనున్నారు. మొత్తం సుమారు 23.84 మెట్రిక్ టన్నుల చక్కెర వేలం వేస్తామని, వేలం దక్కించుకున్న వారే రవాణా ఖర్చులు భరించాలని ఆమె స్పష్టం చేశారు.
News April 5, 2026
ఖమ్మం జిల్లా పరిషత్‌కు 62 ఏళ్లు.. నిధుల కొరత

ఖమ్మం జిల్లా పరిషత్‌కు 62 ఏళ్లు పూర్తయ్యాయి. 1964 ఏప్రిల్ 6న కామరాజ్ నాడార్ చేతుల మీదుగా భవనం ప్రారంభమైంది. అప్పటి నుంచి అభివృద్ధి పనుల్లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం పాలకవర్గం లేక ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. నిధుల కొరతతో పనులు నిలిచిపోయాయి. గత రెండేళ్లుగా సాధారణ, ఎస్ఎఫ్సీ నిధులు రాకపోవడంతో జిల్లా పరిషత్, మండల పరిషత్తులలో అభివృద్ధి పనులు నిలిచినట్లు అధికారులు తెలిపారు.
News April 4, 2026
ఖమ్మం: ఏప్రిల్ 19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు

ఖమ్మం జిల్లాలో తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 19న నిర్వహించనున్నట్లు డీఈవో చైతన్య జైని తెలిపారు. 6వ తరగతి పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7–10 తరగతుల పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరుగుతుందని పేర్కొన్నారు. కారేపల్లి, టేకులపల్లి కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సూచించారు.


