News April 10, 2025
ఉద్యోగ మేళా వార్షిక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ మేళా వార్షిక క్యాలెండర్‌ను అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ బుధవారం ఆవిష్కరించారు. కలెక్టరేట్ నుంచి ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు గత నెల 25, 26 తేదీల్లో ఇచ్చిన ఆదేశాల మేరకు క్యాలెండర్ విడుదల చేసినట్లు తెలిపారు. క్రమం తప్పకుండా మేళాలను నిర్వహించాలని ఆదేశించారు.
Similar News
News December 15, 2025
భద్రకాళి సన్నిధిలో మోగ్లీ చిత్ర యూనిట్

వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారిని ఇటీవల విడుదలయిన మోగ్లీ చిత్ర యూనిట్ దర్శించుకుంది. చిత్రం హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మడోల్కర్, చిత్ర యూనిట్ సభ్యులు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పూజానంతరం ఆలయ స్నపన మండపంలో మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.
News December 15, 2025
లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

⋆ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న ‘ఫంకీ’ సినిమా 2026, ఫిబ్రవరి 13న విడుదల
⋆ అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమా టీజర్‌ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మూవీ టీమ్
⋆ విఘ్నేశ్ శివన్ డైరెక్షన్‌లో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ విడుదల వాయిదా.. ఈ నెల 18న రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్‌పోన్ చేసిన టీమ్
News December 15, 2025
లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల ద్వారా న్యాయ సలహాలు: జడ్జి సంతోష్

లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా న్యాయ సలహాలు అందించడంతో పాటు, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తామని సిద్దిపేట జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ, జడ్జి సంతోష్ కుమార్ తెలిపారు. సోమవారం సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్లినిక్‌ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రతి క్లినిక్‌లో ఒక అడ్వకేట్ తో పాటు పారా లీగల్ వాలంటీర్ అందుబాటులో ఉంటారని వివరించారు.


