News September 1, 2024
ఉద్యోగ విరమణ చేసిన అధికారులకు సత్కారం

పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ విభాగంలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన పలువురు అధికారులను ఎస్పీ అద్నాన్ నయీం అస్మి శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఉద్యోగుల సేవలను కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం ఏ అవసరం ఉన్నా స్వయంగా వచ్చి తనను కలవవచ్చని ఆయన భరోసా ఇచ్చారు.
Similar News
News November 22, 2025
ఈనెల 23న సత్యసాయి జయంతి వేడుకలు: కలెక్టర్

జిల్లాలో అధికారికంగా ఈనెల 23న సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం భీమవరంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణపై సమీక్షించారు. సమావేశంలో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
News November 22, 2025
ప.గో: అప్డేట్ కోసం కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు

ట్రైనింగ్‌పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్‌పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
News November 22, 2025
ప.గో: మాక్ అసెంబ్లీలో ‘రియల్’ పాలిటిక్స్?

మాక్ అసెంబ్లీకి విద్యార్థుల ఎంపిక ప్రక్రియలో పశ్చిమ గోదావరి జిల్లాలో గందరగోళం నెలకొంది. క్విజ్‌లో ప్రతిభ చూపిన తాడేరుకు చెందిన ఉమా లిఖిత ఎంపికైనట్లు విద్యా శాఖ ప్రకటించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. చివరి నిమిషంలో జాబితా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ మార్కులు వచ్చిన రాయకుదుర్రు విద్యార్థిని ఎంపిక చేయడం వెనుక రాజకీయ జోక్యం ఉందని ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.


