News August 14, 2024
ఉనికిని కాపాడుకునేందుకు TDP నేతలపై దాడులు: మంత్రి బీసీ

కర్నూలు (D) పత్తికొండ (మం) హోసూరులో TDP నేత శ్రీను హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. YCP ఉనికిని కాపాడుకునేందుకు జగన్&కో తమ నేతలు, కార్యకర్తలపై హత్యలు, బెదిరింపులతో దాడులకు పాల్పడుతుందని బీసీ విమర్శించారు. హత్య చేసిన వారిని, వారి వెనుకున్న వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వం తరఫున శ్రీను కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి బీసీ హామీచ్చారు.
Similar News
News January 8, 2026
కర్నూలు జిల్లాలో 78 ఉద్యోగాలకు నోటిఫికేషన్

కర్నూలు జిల్లాలోని KGBVల్లో 78 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టే ఈ నియామకాల్లో టైప్-3 కేజీబీవీల్లో 56, టైప్-4 కేజీబీవీల్లో 22 ఖాళీలు ఉన్నాయి.
★ అర్హులు: మహిళా అభ్యర్థులు మాత్రమే..
★ దరఖాస్తు గడువు: జనవరి 11 వరకు
★ దరఖాస్తు కేంద్రం: జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అప్లికేషన్లు అందజేయాలని అధికారులు సూచించారు.
News January 8, 2026
విద్యార్థులకు సైబర్ నేరాలు, భద్రతపై అవగాహన

కర్నూలు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో సైబర్ నేరాలు, రహదారి భద్రత, మహిళా రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శక్తి యాప్, శక్తి వాట్సాప్ నంబర్ 7993485111, డయల్ 100 వంటి సేవలపై శక్తి టీంలు అవగాహన కల్పిస్తున్నాయి. ప్రతి విద్యార్థి హెల్మెట్ వాడకం, సైబర్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మహిళల రక్షణకు పోలీసులు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.
News January 8, 2026
త్వరగా పరిష్కారం చూపండి: కలెక్టర్

అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన, నాణ్యత కలిగిన పరిష్కారాన్ని చూపించాలని తహశీల్దార్లను కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కర్నూలు డివిజన్లో రెవెన్యూ క్లినిక్, రెవెన్యూ స్పెషల్ క్యాంప్‌ల ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంపై సమావేశం నిర్వహించారు. వచ్చిన అర్జీలకు వెంటనే నోటీసులు ఇచ్చి, నిర్దేశిత గడువు లోపు వాటిని పరిష్కరించాన్నారు.


