News March 9, 2025

ఉపమాక కల్యాణ ఉత్సవాలకు శ్రీకారం

image

నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక తిరు చారా కళ్యాణ ఉత్సవాలకు ఆదివారం శ్రీకారం చుట్టారు. మాడ వీధుల్లో పెండ్లి కావిడ ఊరేగింపుతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. భక్తులు పలువురు వెంకటేశ్వర స్వామికి పసుపు కుంకుమతో పాటు కొబ్బరి బొండాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు పాల్గొన్నారు.

Similar News

News November 18, 2025

తలసానిని కలిసిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నవీన్ యాదవ్.. మామ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తలసానికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.

News November 18, 2025

అనకాపల్లి జిల్లాలో 2,42,480 రైతులకు లబ్ధి: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం కింద 2,42,480 మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. 19వ తేదీన రైతుల ఖాతాల్లో రూ.158.4 కోట్లు జమ కానున్నట్లు పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో 22,300, చోడవరంలో 51,260, మాడుగులలో 45,340, నర్సీపట్నంలో35,040, పాయకరావుపేటలో 39,300, ఎలమంచిలిలో 33,760 మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు.

News November 18, 2025

తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిపై దృష్టి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఇన్‌స్ట్రుమెంట్ ఆఫ్ థింక్స్ ఆక్వా పాండ్స్” కార్యక్రమానికి మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్వా రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని సాధించే దిశగా ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.