News March 9, 2025
ఉపమాక కల్యాణ ఉత్సవాలకు శ్రీకారం

నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక తిరు చారా కళ్యాణ ఉత్సవాలకు ఆదివారం శ్రీకారం చుట్టారు. మాడ వీధుల్లో పెండ్లి కావిడ ఊరేగింపుతో ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. భక్తులు పలువురు వెంకటేశ్వర స్వామికి పసుపు కుంకుమతో పాటు కొబ్బరి బొండాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు పాల్గొన్నారు.
Similar News
News April 10, 2026
భద్రాద్రిలో వైభవంగా శ్రీవారి నిత్య కళ్యాణం

భద్రాద్రి క్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి విశేష పూజలు చేసిన అనంతరం, బేడా మండపంలో సీతారాములకు వేద మంత్రాల మధ్య కళ్యాణ తంతు పూర్తి చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు.
News April 10, 2026
బెట్టింగ్ యాప్ ప్రమోట్.. విశాఖలో ఇద్దరి అరెస్ట్

విశాఖలోని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఓ కళాశాల ఫుట్బాల్ కోచ్ గణేశ్‌తో పాటు అనిల్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. వీరిద్దరూ మధురవాడ భగవాన్ దాస్ కాలనీ ప్రాంతానికి చెందిన వారే. విశాలాక్షి నగర్‌లో యువకుడ్ని క్రికెట్ ప్రిడిక్షన్ అంటూ నమ్మించి బెట్టింగ్ యాప్‌ను ప్రోత్సహించారు. వీరి మాటలు నమ్మిన యువకుడు రూ.12.50 లక్షలు పోగొట్టుకున్నాడు.
News April 10, 2026
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: అడ్లూరి

రైతు పండించిన పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ధర్మపురి పట్టణ కేంద్రంల్లోని వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రైతులు రబీ సీజన్లో పండించిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిదన్నారు.


