News March 15, 2025

ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం కృషి: మంత్రి

image

విజయనగరం మహిళా ప్రాంగణంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సర్కులర్ ఆక్వా కల్చర్ విధానాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. మహిళల జీవనోపాధిని పెంచేందుకు ఇదో కొత్త అవకాశమన్నారు. వెలుగు 2.0 ద్వారా రాష్ట్రంలోని మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ఈ అవకాశాన్ని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

Similar News

News March 15, 2025

VZM: ఈనెల 16న FRO ఉద్యోగాల‌కు రాత‌ప‌రీక్ష‌

image

ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్స్ ఉద్యోగాల భ‌ర్తీకి ఈ నెల 16న జ‌రిగే రాత‌ప‌రీక్ష‌కు ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి ఆదేశించారు. పట్టణంలోని త‌మ ఛాంబ‌ర్లో శ‌నివారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌లు ఉద‌యం 9.30 నుంచి 12 గంట‌లు వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 5 గంట‌లు వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని చెప్పారు. రెండు ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశామన్నారు.

News March 15, 2025

సన్మార్గంలో జీవించకపోతే కఠిన చర్యలు: SP

image

విజయనగరం జిల్లాలో రౌడీ షీట్ కలిగిన వ్యక్తులు నేర ప్రవృత్తిని విడనాడకుంటే కఠిన చర్యలు తప్పవని SP వకుల్ జిందాల్ హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. రౌడీ షీట్ కలిగిన వ్యక్తుల ప్రవర్తన, కదలికలను నిత్యం గమనించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. బ్యాడ్ క్యారెక్టర్ షీట్లు కలిగిన వ్యక్తులను గుర్తించి బైండోవర్ చేయాలన్నారు. బీసీ షీట్లు కలిగిన వ్యక్తుల లేటెస్ట్ ఫోటోలు తీయాలన్నారు.

News March 15, 2025

VZM: కన్న తండ్రి ముందే విషం తాగి మృతి

image

దొంగతనం నింద తనపై మోపారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు కన్న తండ్రి ముందే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భోగాపురం మండలం అమకాంలో ఈనెల 11న చోటుచేసుకోగా సదరు యువకుడు చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో పనిచేస్తున్న అప్పలనాయుడు.. టూరిస్ట్ సెల్ ఫోన్ దొంగలించాడని యాజమాన్యం నిందించడంతో అవమానంగా బావించి పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు.

error: Content is protected !!