News November 25, 2024

ఉపాధి కల్పనలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా 2వ స్థానం

image

ఎంఎస్ఎంఈ (మైక్రో,స్మాల్&మీడియం ఎంటర్ప్రైజెస్) ద్వారా గుంటూరు జిల్లాలో 16.085 యూనిట్లు రూ.477.56కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో 2వ స్థానం సాధించింది. ముందు వరుసలో విశాఖ, తర్వాత నెల్లూరు, కృష్ణా జిల్లాలు ఉన్నట్లు సామాజిక ఆర్థిక సర్వే-2024 వెల్లడించింది. ప్రభుత్వ పారిశ్రామిక పాలసీతో 2023-27ల్లో 19,86,658 మందికి ఉపాధి లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిపై మీ కామెంట్..

Similar News

News December 7, 2024

కేంద్రీయ విద్యాలయాల ఆమోదం పట్ల ఎంపీ లావు హర్షం 

image

దేశ వ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 8 కేంద్రియ విద్యాలయాలకు ఆమోదం లభించిందని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. ఇందులో పల్నాటి వాసులు ఎంతగానో ఎదురు చూస్తున్న రొంపిచర్ల, మాచర్ల మండలంలోని తాళ్లపల్లిలో కేంద్రియ విద్యాలయాలకు ఆమోదం లభించి, ప్రారంభానికి లైన్ క్లియర్ అయిందన్నారు. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు.  

News December 7, 2024

గుంటూరు: కలెక్టర్ల సమావేశానికి ఏర్పాట్లు పరిశీలన

image

ఈనెల 10,11 తేదీలలో వెలగపూడి సచివాలయం వద్ద జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ నాగలక్ష్మీ పరిశీలించారు. సీటింగ్ ఏర్పాట్లు, అకామడేషన్ ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. వెహికల్ పార్కింగ్, సెక్యూరిటీ, భోజన ఏర్పాట్ల గురించి ఆమె స్థానిక అధికారులతో మాట్లాడారు. డ్యూటీలు కేటాయించిన అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు.  

News December 7, 2024

విజయవాడ అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన బాపట్ల ఎంపీ

image

బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ శుక్రవారం కేంద్ర మంత్రి అమిత్‌షాను న్యూఢిల్లీలో కలిశారు. ఈ భేటీలో ఎంపీ కృష్ణప్రసాద్ రాష్ట్రంలో అమలవుతున్న విపత్తు నిర్వహణ విధానాన్ని, ఇటీవల వచ్చిన వరదల గురించి ఆయనకు తెలియజేశారు. రాష్ట్రంలో విజయవాడతో సహా వరదలకు ప్రభావితమయ్యే ప్రాంతాల వివరాలను ఎంపీ తెన్నేటి, అమిత్ షాకు వివరించారు.