News August 9, 2024
ఉపాధి నైపుణ్య శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవి కుమార్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు వెబ్ సైట్ tgbestudycircle.cgg.gov.in లో ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ కుషాయిగూడలోని ‘ఎల్డీ హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ’ ద్వారా 100 మందికి ఉచిత నైపుణ్య శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.
Similar News
News September 11, 2024
మారుముల ప్రాంత యువత క్రీడల్లో రాణించాలి: ఎస్పీ
మారుమూల ప్రాంత యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కొత్తపేట, సనుగుల గ్రామంలో మంగళవారం సాయంత్రం యువతకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌పీ మాట్లాడుతూ.. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలన్నారు. మన జీవనశైలిలో చదువు, ఉద్యోగంతో పాటు క్రీడలు కూడా ముఖ్యమేనని అన్నారు.
News September 10, 2024
జగిత్యాల: మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి: కలెక్టర్
జగిత్యాల జిల్లాలోని సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్లు, హెల్త్ సూపెర్వైజర్‌లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో డెంగీ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందని పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని గ్రామాల్లో ఫాగింగ్ చేయాలనీ, పిచ్చి మొక్కల్ని తొలిగించి జ్వరాలు వచ్చే చోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.
News September 10, 2024
మంత్రి పొన్నం ప్రభాకర్‌పై మండిపడ్డ మేయర్ సునీల్ రావు
మంత్రి పొన్నం ప్రభాకర్‌పై కరీంనగర్ మేయర్ సునీల్ రావు మండిపడ్డారు. నగరంలో ఆయన మాట్లాడాతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుందని, బాధ్యత గల మంత్రిగా కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధికి పొన్నం ఒక్క రూపాయి మంజూరు చేయలేదన్నారు. నగరంలో 3 నెలల క్రితం తమకు సమాచారం లేకుండా మున్సిపల్ సమీక్ష సమావేశం చేశారని, తమ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా కరీంనగర్లో సమావేశాలు పెట్టడమేంటని ప్రశ్నించారు.